Monday, December 23, 2024
HomeMovie Newsదండ ఎత్తుకొచ్చావా..? కొనుక్కొచ్చావా ? ఫ్యాన్ తో బాలయ్య కామెడీ

దండ ఎత్తుకొచ్చావా..? కొనుక్కొచ్చావా ? ఫ్యాన్ తో బాలయ్య కామెడీ

- Advertisement -

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బయటకు వచ్చాడంటే..ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంటారు. అభిమానులను కొట్టడమో..లేక తన ప్రసంగాలతోనో..ఇలా ఏదో రకంగా సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంటారు. తాజాగా మరోసారి బాలయ్య ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ విషయంతోనే వార్తల్లో నిలిచారు.

బాలయ్య అభిమానులతో పాటు టిడిపి కార్యకర్తలను కలిశారు. అందులో భాగంగానే కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ ఆయనతో ముచ్చటిస్తూ కనిపించారు. అందులో కొందరు బాలకృష్ణకు దండ వేయాలని ఉత్సాహం కబారిచారు. దండతో వాళ్ళని చూసిన బాలయ్య ఆ దండ ఎక్కడ తెచ్చావ్ అని ప్రశ్నించారు. అంతేకాకుండా అక్కడి నుంచి ఎత్తుకొచ్చావా కొనుక్కొచ్చావా ? అని అడిగాడు. అభిమాని బాలయ్య ప్రశ్నకు కాదు సార్ తెచ్చుకున్నాం అని చెప్పాడు. వెళ్లి కొనుక్కు రా అంటూ సైటైరికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు బాలయ్య. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఆ తర్వాత జై బాలయ్య నినాదంతో ఆ ప్రదేశం మార్మోగింది.

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీని ప్రస్తుతానికి NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ కాగా, అందరిని ఆకట్టుకుంది. ఎలక్షన్స్ కంటే ముందే ఈ మూవీకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు . అయితే ఆ తర్వాత 2024 ఎన్నికల ప్రచారంలో బిజీగా మారిన బాలయ్య ఈ సినిమా నుంచి విరామం తీసుకున్నారు. ఫలితంగా ఎన్.బి.కె 109 మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ రావడం, కూటమి గెలుపుతో చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టడంతో ఫుల్ ఖుషి గా ఉన్న బాలయ్య తిరిగి హైదరాబాద్ వచ్చేసారు. ఇక ఈ సినిమాకు సంబంధించి బాబి కొత్తగా వారం రోజులు షెడ్యూల్ ప్లాన్ చేశాడని, బాలయ్య త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్నాడని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఊర్వశి రౌతేల హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read