Movie News

ఆఫర్లు లేని హీరోయిన్ కు బాలయ్య ఆఫర్..

బాలయ్య మనసు బంగారం అని అంత అంటుంటారు..కానీ ఇలా ఎందుకు అంటారో తెలిస్తే అస్సలు బాలయ్య ను వదిలిపెట్టారు. ఇప్పుడు ఓ హీరోయిన్ విషయంలో బాలయ్య చేసిన పనికి అభిమానులు అలాగే అంటున్నారు. సినీ పరిశ్రమలో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ అర్ధం కాదు మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా వారి ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరూ సక్సెస్ కాలేరు. పొరపాటుగా హిట్ వచ్చినప్పటికీ మళ్ళీ రెండో ఛాన్స్ వరుస అవకాశాలు ఎందుకో కొందరికి రావు. టాలీవుడ్ లో మంచి సినిమాలు పడినప్పటికీ బిజీ హీరోయిన్ కాలేకపోయింది ప్రగ్య. కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి సినిమాలు ఈమెకి పడ్డాయి.

మెగా హీరో వరుణ్ తేజ్ తో కంచె ఆ తర్వాత కొన్ని గ్లామరస్ రోల్స్ కూడా చేసింది. కానీ ఇప్పటికీ టాలీవుడ్ లో అంత అవకాశాలు లేవు. బహుశా అయితే చివరి సరిగా ఆమె కెరీర్ లో అందుకున్న భారీ హిట్ ఏదన్నా ఉంది అంటే అది నటసింహ నందమూరి బాలకృష్ణతో చేసిన చిత్రం “అఖండ” అనే చెప్పాలి. ఈ మూవీ తర్వాత కూడా అమ్మడు ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ భామకు ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. బాలయ్య తన 109వ సినిమాని దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్నారు. ఈ మూవీ లో హీరోయిన్ గా ప్రగ్య కు ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈమె సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యిందని అంటున్నారు. కాకపోతే మేకర్స్ మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.