బైలంపుడి’ స‌క్సెస్ మీట్!!

తార క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మించిన  చిత్రం ‘బైలంపుడి’. హరీష్‌ వినయ్‌, త‌నిష్క తివారి జంటగా న‌టించ‌గా  అనిల్‌ పిజి రాజ్‌ దర్శకత్వం వ‌హించారు.   గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 27న విడుద‌లై ప్రేక్ష‌క‌ల‌ను అల‌రిస్తోంది. ఈ సంద‌ర్భంగా  చిత్ర యూనిట్ ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత  బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ…‘‘పారిశ్రామికవేత్తగా ఉన్న నేను సినిమా మీద ఆసిక్తతో తొలిసారిగా నిర్మాతగా ‘బైలంపుడి’ చిత్రాన్ని  నిర్మించాను. `ఇక్క‌డ యుద్ధం చేయాలి…గెల‌వ‌డానికి కాదు, బ‌త‌కాడినికి“ అనే కాన్సెప్ట్ తో రూపొందించిన మా సినిమా ఈ శుక్ర‌వారం విడుద‌లై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చూసిన వాళ్లంద‌రూ సినిమా చాలా బావుందంటున్నారు. నేను ఇందులో గురునారాయ‌ణ అనే విల‌న్ క్యార‌క్ట‌ర్ చేశాను. నిర్మాత‌గా, న‌టుడుగా నాకు ఈ సినిమా పూర్తి సంతృప్తినిచ్చింది. మౌత్ టాక్ తో ఇప్పుడిప్పుడే జ‌నం థియేట‌ర్స్ కు వ‌స్తున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్స్ కోరిక మేర‌కు  కొన్ని  థియేట‌ర్స్ కూడా పెంచుతున్నాం.