నటి కస్తూరి శంకర్‌కు ఊరట లభించింది. తన చేసిన అనుచిత వ్యాఖ్యలు కారణంగా హైదరాబాద్‌లో అరెస్టై, చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలులో రిమాండ్‌కు పంపబడిన ఆమెకు ఎగ్మూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 3వ తేదీన చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో కస్తూరి శంకర్ తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం వార్తల్లో నిలిచింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయగా, చెన్నైలో పలు కేసులు నమోదయ్యాయి.
కస్తూరి, కోర్టుకు తాను ఒంటరి తల్లిగా ఉన్నందున తన స్పెషల్ చైల్డ్‌ను చూసుకోవడానికి బెయిల్ మంజూరు చేయాలని విన్నవించింది. ఈ విన్నపాన్ని పరిశీలించిన కోర్టు, ఆమెకు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఆగ్రహం మరియు వివరణ తరువాత కస్తూరి తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.