Movie News

చీరను ఆలా పైకి లేపుతూ రెచ్చిపోయిన అంజలి

తెలుగు అమ్మాయి అంజలి తనలోని హాట్ యాంగిల్ ను బయటకు తీస్తుంది..ఇంకా చీర కట్టుకొని నిండుగా ఉంటె ఇక ఛాన్సులు రావడం కష్టమే అని ఫిక్స్ అయినా ఈ రాజోలు పిల్ల..ఇక చీరను పైకి లేపుతూ కుర్రకారులో వేడి సెగలు రేపుతోంది. తాజాగా అంజలి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసే ‘బహిష్కరణ’ తెరకెక్కింది. ముఖేష్ ప్రజాపతి తెరకెక్కించిన ఇది 1990 నాటి కథతో గుంటూరు రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో ఇది రూపొందింది.

ఈ వెబ్ సిరీస్‌ను జూలై 19 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు జీ5 (ZEE5) సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే ఓ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. తాజాగా దీని నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో అంజలి పాత్రను ఎంతో వైలెంట్‌గా చూపించారు. ముఖ్యంగా ఆమె వేశ్యగా ‘ఆకు వక్క అందిస్తా.. మూడు పూటలా స్వర్గం చూపిస్తా’ అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక, ఈ టీజర్ బోల్డుగా, వైలెంట్‌గా ఉంది. దీంతో దీనికి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను విక్సెల్ పిక్చర్ ఇండియా పతాకంపై ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు. ఇందులో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, శ్రీతేజ్, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మమ్మద్ బాషా కీలక పాత్రలు నటించారు. ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు సిద్ధార్థ్ సదాశివుని మ్యూజిక్ కంపోజ్ చేశారు.