Monday, December 23, 2024
HomeMovie Newsపుష్ప ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

పుష్ప ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

- Advertisement -

అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 ది రూల్ (Pushpa 2: The Rule) కు సంబదించిన తాజా సమాచారం సినీప్రేమికులను నిరుత్సహపరుస్తుంది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5, 2024న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. అయితే
పుష్ప ది రైజ్ (Pushpa: The Rise) ను నవంబర్ 22న రీరిలీజ్‌ చేయబోతున్నారు. అయితే, ఈ రీరిలీజ్‌ కేవలం హిందీ వెర్షన్‌కి మాత్రమే పరిమితం చేయడంతో తెలుగు ప్రేక్షకులు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్‌ తెలుగు వెర్షన్‌ కూడా రీరిలీజ్ చేయాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

పుష్ప 2 లో కన్నడ భామ రష్మిక మందన్నా శ్రీవల్లి పాత్రతో మళ్లీ ఆకట్టుకోనుండగా, ఫహద్‌ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, అనసూయ భరద్వాజ్‌, సునీల్‌, రావు రమేశ్‌, ధనంజయ వంటి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ స్థాయిలో నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ఏ రేంజ్ లో అందుకుంటుందో చూడాలి. ఇప్పటికే తాజాగా రిలీజ్ అయినా ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read