Saturday, October 19, 2024
HomeMovie News'బచ్చల మల్లి' గా అల్లరి నరేష్

‘బచ్చల మల్లి’ గా అల్లరి నరేష్

- Advertisement -

కామెడీ సినిమాలతో ఎంటర్​టైన్ చేసే స్టార్ హీరో అల్లరి నరేశ్ ఇప్పుడు మాస్ రోల్​లో కనిపించనున్నారు. ‘బచ్చల మల్లి’ అనే సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగా మేకర్స్ తాజాగా ఓ స్పెషల్ పోస్టర్​ను విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ లో రిక్షా నడిపే వ్యక్తిగా ‘బచ్చల మల్లి’ పాత్రలో అల్లరి నరేశ్ కనిపిస్తున్నాడు. మెడలో తాయెత్తు .. చేతికి కాశీ దారం .. పొగ తాగుతూ కాస్త కేర్ లెస్ గా కనిపిస్తున్నాడు. చూస్తుంటే లోకల్ రౌడీ ట్యాగ్ ఉన్నట్టే అనిపిస్తోంది. వాతావరణం చూస్తుంటే ఇది 1980లలోని కథగా కనిపిస్తోంది. ‘తుని’ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు.

అల్లరి నరేశ్ సరసన హీరోయిన్‌గా అమృత అయ్యర్ కనిపిస్తుండగా, ఇతర సహ నటుల పాత్రల్లో రోహిణీ, రావు రమేశ్, అచ్చుత్ కుమార్, బలగం జయరాం, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష కనిపిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఫుల్ మాస్ స్టోరీతో అలరించేందుకు రెడీ అవుతోన్న ఈ ప్రాజెక్టు మరి కొద్ది నెలల్లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం హైదరాబాద్​లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read