Friday, November 22, 2024
Homeతెలుగు వార్తలు100% ఫన్ 0% లాజిక్ తో ఈ నెల 23 న గ్రాండ్ గా రిలీజ్...

100% ఫన్ 0% లాజిక్ తో ఈ నెల 23 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న యూత్ ఫుల్ ఫన్ ఓరియెంటెడ్ “మా ఆవారా జిందగీ”..

బయటి లైఫ్ స్టైల్ కు అలవాటు పడిన నలుగురు ఆవారా కుర్రాళ్ళు నాలుగేళ్లు చదవాల్సిన బి.టెక్ ను ఎనిమిదేళ్లు చదివి బయటికి వచ్చిన తరువాత వారికి జాబ్స్ దొరకక ఇంట్లో వారికి సమాధానం చెప్పుకోలేక ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.. తమ క్యారెక్టర్స్‌తో ఈ ఆవారా కుర్రోళ్ళు ప్రేక్షకులను ఎలా ఎంటర్‌టైన్ చేశారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమే “మా ఆవారా జిందగీ”. బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే నటీ నటులుగా దేపా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 100% ఫన్ 0% లాజిక్ మూవీ “మా ఆవారా జిందగీ. ఈ చిత్రానికి కంభంపాటి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరించగా.. ప్రతీక్ నాగ్ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 23 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.

- Advertisement -

చిత్ర దర్శకుడు దేపా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో నలుగురి ఆవారా కుర్రాళ్ల పనులు ఎలా ఉండబోతున్నాయి? ఆ పనులకు కామెడీ ఎలా లింక్ చేశారు? అనే ఫన్ ఓరియెంటెడ్, యూత్ ఫుల్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రమే “మా ఆవారా జిందగి”. నేటితరం ఆడియన్స్ మెచ్చే కథ ఎంచుకొని దానికి కావాల్సినంత ఫన్ యాడ్ చేశాము. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ నవ్వుకునేలా ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంటుంది. జూన్ 23 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

బిగ్ బాస్ ఫెమ్ శ్రీహన్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. ఇందులో బోల్డ్ సబ్జెక్టు ఉన్నా నా నుంచి అందరూ ఇలాంటి బోల్డ్ సబ్జెక్ట్ వస్తుందని ఊహించరు. నన్ను ఇష్టపడే వాళ్ళు నా యాక్టింగ్ ను కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను. పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో చేసే అవకాశం రావడం చాలా కష్టం. చిన్న సినిమాలలో నటించి మంచి నటుడుగా నిరూపించుకోవచ్చు. ఇలాంటి బోల్డ్ కంటెంట్ సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలి. ఈ కథకు మమ్మల్ని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మంచి ఎంటర్టైన్మెంట్ తో వస్తున్న ఈ సినిమాలోని మా నటనకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్ అవుతారని కచ్చితంగా చెప్పగలను. జూన్ 23న వస్తున్న మా సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

నటుడు అజయ్ మాట్లాడుతూ.. జబర్దస్త్ ద్వారా వచ్చిన తర్వాత పటాస్ లో కొన్ని ఎపిసోడ్స్ చేయడం జరిగింది. వాటికి నాకు మంచి ఆదరణ లభించింది. ఫస్ట్ టైం సినిమాలో నటిస్తున్నాను. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.ఈ నెల 23 న అందరూ థియేటర్ కు వచ్చి మమ్మల్ని, మా సినిమాను చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు చెర్రీ మాట్లాడుతూ.. ఒక డ్యాన్సర్ గా లైఫ్ స్టార్ట్ చేసిన నాకు మా చిట్టి మాస్టర్ డైరెక్టర్ శ్రీకాంత్ అన్నకు పరిచయం చేయడంతో ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇలాంటి మంచి అవకాశం కల్పించిన చిట్టి మాస్టర్ కు శ్రీకాంత్ అన్నకు ధన్యవాదాలు. ఈ నెల 23 న థియేటర్ లో విడుదల అవుతున్న మా సినిమాను చూసి ప్రేక్షకులు అందరూ బిగ్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు మహేందర్ నాథ్ మాట్లాడుతూ… ఈ సినిమా ఆవారా తనానికి పోరంబోకు తనానికి పరాకాష్ట అని చెప్పవచ్చు. ఇందులో నటించిన పోరగాళ్లు ఎంతో అల్లరి చేశారు. దర్శకుడు శ్రీకాంత్ కూడా యూత్ కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా బాగా తీశాడు. ఇందులో శ్రీహాన్ కు ఫాదర్ గా నటించాను. ఈ సినిమా చూసిన తర్వాత మేము ఫేమస్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేసిన నన్ను ఆవారా కి ఫాదర్ అనేలా ఈ సినిమా ఉంటుంది. యూత్ అందరూ కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారని అన్నారు.

నటీనటులు:
బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ తదితరులు

సాంకేతిక నిపుణులు:
బ్యానర్ : విభా ఎంటర్‌టైన్‌మెంట్స్
చిత్రం – మా ఆవారా జిందగీ
ప్రొడ్యూసర్ -నంద్యాల మధుసూదన్ రెడ్డి
దర్శకుడు-దేపా శ్రీకాంత్ రెడ్డి
సహ నిర్మాత-కంభంపాటి విజయ కుమార్
లైన్ ప్రొడ్యూసర్: వంటేరు ప్రణయ్ రెడ్డి
సినిమాటోగ్రాఫర్: శ్యామ్ ప్రసాద్ వి., ఉరుకుంద రెడ్డి
ఎడిటర్: సాయిబాబు తలారి
సంగీతం-ప్రతీక్ నాగ్
వి. యఫ్. ఎక్స్ -కౌశిక్ గుండు(చింటూ)
పి. ఆర్. ఓ : సాయి సతీష్ పాలకుర్తి

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read