ప్రముఖ నిర్మాత సాయి రాజేశ్ తో స్పెషల్ చిట్ చాట్ – అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై గతంలో హృదయకాలేయం, కొబ్బరిమట్ట వంటి కమర్షీయల్ హిట్స్ నిర్మించారు
కలర్ ఫొటో సినిమా ఎలా మొదలైంది
కలర్ ఫొటో కథ నా సొంత అనుభవాలు నుంచి నేను తయారు చేసుకున్న కథ. ఈ సినిమా దర్శకుడు సందీప్ నాకు ఎప్పటినుంచో స్నేహితుడు, ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో మనోడుకి డైరెక్షన్ ఛాన్స్ ఇప్పిద్దామని చాలా ట్రై చేశాను, అయితే కొన్ని అనివార్య కారాణాలు వల్ల ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. దీంతో సందీప్ కి నేను రాసుకున్న కథ ఇచ్చి, నేనే నిర్మాతగా మారి కలర్ ఫొటో చిత్రాన్ని తీశాను, అలానే ఈ చిత్ర నిర్మాణంలో నా స్నేహితుడు బెన్నీ సహకారం మరువలేనిది.
రంగు వివక్ష గురించి ఈ సినిమాలో ప్రస్తావించినట్లుగా అనిపిస్తోంది నిజమేనా
రంగు వివక్ష గురించి ఈ సినిమాలో ముఖ్యంగా చాలా నిజాయితీగా, నికచ్ఛిగా చెప్పడానికి ప్రయత్నించాము, అలా అని ఇదేదో సీరియస్ సబ్జెక్ట్ అనుకోవాల్సిన అవసరం లేదు, ఆడియెన్స్ కావాల్సినంత హ్యూమర్, ఎమోషన్స్ తోనే మేము అనుకున్న పాయింట్ కూడా సూటిగా చెప్పడానికి ప్రయత్నం చేశాము
నల్లగా ఉంటాడనే సుహాస్ ని హీరోగా తీసుకున్నారు అనుకోవచ్చా
అవును కానీ సుహాస్ కూడా నటన పరంగా తనకి తాను ప్రూవ్ చేసుకున్నాడు. సుహాస్ కమీడియన్ గా యాక్ట్ చేసిన సినిమాల్లో తన నటనని ఆడియెన్స్ ఆదరిస్తున్నారు, అయితే ఈ ప్రాజెక్ట్ మొదలైయ్యే సమయానికి సుహాస్ అప్పుడే సినిమాల్లో నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఓవర్ ఆల్ గా చూస్తే ఈ కథకి తగిన హీరోగా సుహాస్ సూట్ అవుతాడని మా యూనిట్ అందరు ఓ నిర్ణయానికి వచ్చాకే తీసుకోవడం జరిగింది
మీ అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి మొదటి వచ్చిన రెండు సినిమాలు కమర్షీయల్ సక్సెస్ లు అయ్యాయి, మరి మూడో సినిమా ఎవరైనా పెద్ద హీరోతో వెళ్లకుండా మళ్లీ ఇలా రిస్క్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది
నా మొదటి రెండు సినిమాలు కమర్శీయల్ హిట్స్ అయినప్పటికి, మా బ్యానర్ కి రావాల్సిన గౌరవం రాలేదని నాకు అనిపిస్తూ ఉండేది, దాన్ని ఫుల్ ఫిల్ చేయాలంటే ఎవరైనా కొత్త వాళ్లతోనే ఓ సినిమా తీసి సక్సెస్ అవుదామని నిర్ణయించుకున్నాను. ఈ నేపథ్యంలోనే కలర్ ఫొటోని నిర్మించాను, అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే కేవలం టీజర్ తోనే నాకు, నా బ్యానర్ కి కావాల్సినంత రెస్పెక్ట్, గుర్తింపు వచ్చేశాయి. చాలా మంది ఇండస్ట్రీ వారు ఫోన్లు చేసి మరీ మెచ్చుకోవడం చాలా హ్యాపీ అనిపించింది
ఇక పై కూడా కొత్త వారు, కొత్త కాన్సెప్ట్స్ తోనే సినిమాలు నిర్మించబోతున్నారా, లేక కమర్షీయల్ దారిలోనే వెళ్లే ఛాన్స్ ఉందా
నా ప్రొడక్షన్ అలానే నా బడ్జెట్ ఫ్రొఫైల్ కి భారీ సినిమాలు చేసే సాహసం నేనే చేయలేను, కాన్పెప్ట్ బేస్డ్ సినిమాలు మాత్రమే నేనే నిర్మించగలను. ఇక నేను తీసే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్లో కొత్త వారు అయితేనే కాస్త ఫ్రెష్ ఫీల్ కలుగుతుందని నేను నమ్ముతున్నాను, రానున్న రోజుల్లో కూడా నా ప్రయాణం ఇలానే కొనసాగుతుంది
ఈ సినిమాలో హీరోయిన్ గురించి చెప్పండి
చాందినీ ఈ కథ సూట్ అవుతుందా అని ముందు డౌట్ పడ్డాను, ఎవరైనా బాంబే హీరోయిన్ అయితే బాగుటుంది అనుకున్నా కానీ ఆ తరవాత ఆమె నటను చూసి నేను తన విషయంలో అనవసరంగా డౌట్ ఫీల్ అయ్యాను అనిపించింది. ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను
సునీల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అలానే ఈ సినిమాలో సంగీతం గురించి మీరెంమంటారు
సునీల్ గారు ఈ కథ విని వెంటనే చేస్తానని చెప్పారు. తను ఈ సినిమాలో హీరోయిన్ అన్న పాత్రలో ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. తనవల్ల సినిమాకు వెయిట్ వస్తుందని నమ్ముతున్నాను. అలాగే కాల భైరవ సంగీతం అద్భుతంగా ఉండబోతుంది. తనను కావాలనే ఈ సినిమాకు తీసుకోవడం జరిగింది.
ఆహా లో మీ సినిమా విడుదలవ్వడం పై మీ స్పందన
టీజర్ విడుదల తరువాత ఆహా వారు ఈ సినిమాను తమ యాప్ లో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. థియేటర్స్ లో విడుదల అవ్వలేకపోతున్న భాదకంటే అహలో విడుదల అవుతున్న సంతోషం ఎక్కువ ఉంది.
చివరిగా కలర్ ఫొటో గురించి ఆడియెన్స్ కి ఏం చెబుతారు
అక్టోబర్ 23న విడుదల కాబోతున్న కలర్ ఫోటో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతోంది. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. 90 – 97 ప్రాంతలో జరిగిన ఈ కథ అందరికి కనెక్ట్ అవుతుంది. ఇంటర్నెట్ లేని టైమ్ లో ప్రేమలు ఎలా ఉన్నాయి, ఎలా కలుసుకొనేవారు, ఎలా మాట్లాడుకొనేవారు వంటి అంశాలు ఈ సినిమాలో చెప్పడం జరిగింది.