Tuesday, April 1, 2025
HomeMovie News'రాబిన్‌హుడ్'కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్

‘రాబిన్‌హుడ్’కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్

హీరో నితిన్ సమ్మర్ క్లీన్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు. మార్చి 28న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్  కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్  మీట్ నిర్వహించారు.

- Advertisement -

ప్రెస్ మీట్ లో డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈరోజు రిలీజ్ అయిన మా రాబిన్ హుడ్ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము రెండు థియేటర్స్ ని విజిట్ చేశాము. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నితిన్ గారి పెర్ఫార్మెన్స్ తో పాటు వెన్నెల కిషోర్ గారు రాజేంద్రప్రసాద్ గారి ట్రాక్ ని హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్, ట్విస్ట్ ల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది.  సినిమాని చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వార్నర్ గారి క్యామియోకి కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆయన ఎంట్రీకి థియేటర్ అదిరిపోయింది. ఇది ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా.ఈ ఉగాదికి చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. అందరూ థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’అన్నారు.

నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. ఈరోజు రిలీజ్ అయిన మా రాబిన్ హుడ్ సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. మేము సినిమాని థియేటర్స్ లో చూసి వచ్చాం.ఆడియన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఆడిటోరియంలో సూపర్ హిట్ సినిమా. థియేటర్స్ లో అందరూ ఎంజాయ్ చేసే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ యూత్ అందరూ వెళ్లి ఎంజాయ్ చేసే సినిమా. ఇందులో మంచి కథతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ ఎంటర్టైన్మెంట్ ఫైట్స్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమా సమ్మర్ కి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలుస్తుందని నమ్ముతున్నాం. ప్రతి షో కి కలెక్షన్స్ పెరుగుతూ వెళ్తున్నాయి. గ్రాడ్యుల్ గా ఈ సినిమా పెరుగుతూ వెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాం. డిస్ట్రిబ్యూటర్స్ అందరు కాల్ చేసి చాలా బాగుందని చెప్పారు. ప్రతి షో కి కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సినిమా ఖచ్చితంగా విన్నర్ అవుతుందని నమ్ముతున్నాం. అందరికీ థాంక్ యూ’అన్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read