Friday, October 18, 2024
HomeMovie Newsఅట్టహాసంగా ఎన్టీఆర్‌ పురస్కారాల వేడుక..బేబీ చిత్రానికి ఏకంగా 2 అవార్డ్స్

అట్టహాసంగా ఎన్టీఆర్‌ పురస్కారాల వేడుక..బేబీ చిత్రానికి ఏకంగా 2 అవార్డ్స్

- Advertisement -

రాఘవి మీడియా, కళా వేదిక ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాదులోని హోటల్ దసపల్లాలో శనివారం ఘనంగా జరిగింది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేశ్ కు బెస్ట్ డైరెక్టర్ అవార్డు లభించింది. ఈ సినిమా హీరో ఆనంద్ దేవరకొండకు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. భగవంత్ కేసరి చిత్రానికి గాను ఉత్తమ నిర్మాతగా సాహు గారపాటి అవార్డు అందుకున్నారు.

కాగా, ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవ వేదికపై మురళీమోహన్ ను నిర్వాహకులు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డుల వేడుకకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

అవార్డులు అందుకున్న వారిలో కల్యాణ్ చక్రవర్తి (రచయిత/గీత రచయిత), రఘు కుంచే, శరణ్య ప్రదీప్, హర్షవర్ధన్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read