Monday, December 23, 2024
HomeMovie Newsఅట్టహాసంగా నాగ చైతన్య- శోభిత ప్రీ వెడ్డింగ్ వేడుకలు

అట్టహాసంగా నాగ చైతన్య- శోభిత ప్రీ వెడ్డింగ్ వేడుకలు

- Advertisement -

అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. గతంలో నటి సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతు..కొంతకాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం తో కోర్ట్ ద్వారా అధికారికంగా విడాకులు తీసుకొని ఎవరిదారి వారు చూసుకున్నారు. ఆ తర్వాత చైతు శోభిత ప్రేమలో పడ్డాడు. కొంతకాలంగా రహస్యంగా ప్రేమించుకున్న వీరిద్దరూ..ఆగస్టు లో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుగగా..ఇక ఇప్పుడు పెళ్లి వేడుకలు స్టార్ట్ అయ్యాయి. వైజాగ్‌లోని శోభిత ఇంట్లో పసుపు కొట్టే కార్యక్రమం చేసారు.

ఈ మేరకు ఆమె ఫొటోలను తన ఇన్‌స్టా గ్రామ్​లో షేర్‌ చేశారు. ‘గోధుమ రాయి పసుపు దంచడం, మొదలైపోయింది’ అంటూ పోస్ట్​సు క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆమె స్వయంగా పసుపు దంచుతున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో శోభితా సంప్రదాయంగా కనిపించారు. ఎరుపు రంగు, గోధుమ వర్ణం పట్టు చీరలో శోభిత మెరిసిపోతూ కనిపించారు. ఈ పోస్ట్​ చూసిన ఫ్యాన్స్ పెళ్లి ఎప్పుడో చెప్పాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్​గా మారాయి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read