Thursday, December 26, 2024
HomeUncategorizedమంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ క్లాప్‌తో ప్రారంభ‌మైన తోట క్రియేష‌న్స్ `అత‌డెవ‌డు`.

మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ క్లాప్‌తో ప్రారంభ‌మైన తోట క్రియేష‌న్స్ `అత‌డెవ‌డు`.

ఎస్ఎల్ఎస్ స‌మ‌ర్ప‌ణ‌లో తోట క్రియేష‌న్స్ ప‌తాకంపై సాయి కిర‌ణ్‌, వికాసిని రెడ్డి, జ్యోతిసింగ్ హీరోహీరోయిన్లుగా వెంక‌ట్‌రెడ్డి నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం అత‌డెవ‌డు. తోట సుబ్బారావు నిర్మాత‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. తెలంగాణ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజ‌రై ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు. మాజీ స‌ర్పంచ్ అశోక్ రెడ్డి, కెమెరా స్విచాన్ చేశారు. మొద‌టి స‌న్నివేశానికి తోట నాగేశ్వ‌ర్ రావు గౌర‌వ ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో….
చిత్ర నిర్మాత తోట సుబ్బారావు మాట్లాడుతూ – అత‌డెవ‌డు ఒక డిఫ‌రెంట్ క్రైమ్ అండ్ సన్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ. ద‌ర్శ‌కుడు వెంక‌ట్‌రెడ్డి గారు చెప్పిన క‌థ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి తోట క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. సాయి కిర‌ణ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు, వికాసిని, జ్యోతిసింగ్ హీరోయిన్లు. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన తెలంగాణ మంత్రి వ‌ర్యులు శ్రీ శ్రీ‌నివాస్ గౌడ్ గారికి నా కృత‌జ్ఞ‌త‌లుఅన్నారు.
ద‌ర్శ‌కుడు నంది వెంక‌ట్‌రెడ్డి మాట్లాడుతూ – క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే ఒక ఇంట్రెస్టింగ్‌ ల‌వ్‌స్టోరి ఈ సినిమా. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఫ‌స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. అలాగే వైజాగ్, అర‌కు లోయ‌లో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. ప్రొడ్యూస‌ర్ తోట సుబ్బారావు గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా మంచి బ‌డ్జెట్‌తో సినిమాని నిర్మిస్తున్నారు. టీమ్ అంద‌రం క‌లిసి త‌ప్ప‌కుండా ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకువ‌స్తాం అన్నారు.
హీరో సాయి కిర‌ణ్ మాట్లాడుతూ – ఈ సినిమాలో నేను మెగాస్టార్ గారి ఫ్యాన్ గా న‌టిస్తున్నాను. మంచి క‌థ‌తో వ‌స్తోన్న మా చిత్రాన్ని మీరంద‌రూ ఆద‌రించా‌ల‌ని కోరుకుంటున్నాను. మ‌మ్మ‌ల్ని నమ్మి ఈ అవ‌కాశం ఇచ్చిన తోట సుబ్బారావు గారికి ధ‌న్య‌వాదాలు అన్నారు.
అనంత‌రం వికాసిని రెడ్డి, జ్యోతిసింగ్ మాట్లాడుతూ ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు థాంక్స్ అన్నారు.

- Advertisement -

బ్యాన‌ర్‌: తోట క్రియేష‌న్స్‌,
స‌మ‌ర్ప‌ణ‌: ఎస్ఎల్ఎస్‌,
ప్రొడ్యూస‌ర్‌: తోట సుబ్బారావు,
ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్‌రెడ్డి నంది,
సంగీతం: డ‌్ర‌మ్స్ రాము,
డిఓపి: డి. యాద‌గిరి,
డైలాగ్స్‌: కాకుమాని సురేష్‌, బ‌య్య‌వ‌ర‌పు రవి
పిఆర్ఓ: సాయి స‌తీష్‌.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read