Movie News

RC16 మూవీ కథను లీక్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ అర్జున్

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు – రామ్ చరణ్ కలయికలో RC16 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రారంభం జరిగి కూడా చాల రోజులే అవుతున్న శంకర్ మూవీ తో చరణ్ బిజీ గా ఉండడం తో ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతుంది. ఇదిలా ఉంటె ఈ మూవీకి సంబదించిన ఓ కీలక అప్డేట్ ను రివీల్ చేసాడు బిగ్ బాస్ ఫేమ్ అర్జున్.

ఈ చిత్రంలో అర్జున్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్ 7 సమయంలో గెస్టుగా వచ్చిన బుచ్చిబాబు హౌస్‌లో ఉన్న అర్జున్‌కి RC 16 ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందనే విషయంపై తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు అర్జున్.

“స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది చెప్పను. ఎందుకంటే అది చెబితే నన్ను సినిమాలో నుంచి బయటికి తోసేస్తారు. బావుంటుంది ప్రాజెక్ట్.. అంతకుమించి ఏం చెప్పలేను. మన నేటివిటీ బాగా కనబడే సినిమా. తెలుగు సినిమాలంటే అంతా కమర్షియల్ అలా అనుకుంటారు కదా. అలానే చరణ్ గారు చేసినవి కూడా ఎక్కువ కమర్షియల్ ప్రాజెక్టులే. అయితే తమిళ్‌లో పెద్ద హీరోలు అందరూ వాళ్ల నేటివిటీ కనబడేలా ప్రాజెక్ట్స్ చేస్తుంటారు కదా. వాళ్ల ట్రెడిషన్, వాళ్ల ప్లేస్ ఇలా అన్నీ చూపించడానికి ఇష్టపడతారు కదా. అలానే మీరు RC 16 గురించి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.” అంటూ అర్జున్ అంబటి చెప్పుకొచ్చాడు.

Direct spot pettey thala @BuchiBabuSana 🔥🔥🔥🥵🥵🥵

High tension tho poyela unna 🔥🔥#RC16🔥🔥🔥

pic.twitter.com/IbFOsNlYpg— ༒🅼🅰🅷🅸༒ (@ItsurmahiforRC) July 1, 2024

AddThis Website Tools