Tuesday, December 24, 2024
HomeMovie Newsవిడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్

విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్

- Advertisement -

చిత్రసీమలో మరో జంట విడిపోయారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రహమాన్ మరియు ఆయన భార్య సాయిరా బాను విడిపోయారు. 29 సంవత్సరాల వివాహబంధానికి గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్నీ రహమాన్ భార్య సాయిరా బాను తెలిపింది. తన భర్త ఆర్.ఆర్. రహమాన్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తీవ్రమైన భావోద్వేగ ఒత్తిడి కారణంగా తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది.

ఎంతో బాధతో ఈ నిర్ణయం తీసుకున్నానని, ఈ కష్ట సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు అని సైరా బాను పోస్ట్ చేసింది. వీరి విడాకులకు సంబంధించి సైరా బాను తరఫున లాయర్ వందనా షా అధికారిక ప్రకటన చేశారు.

రెహమాన్, సైరా బానులు 1995లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సంతానం ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అమన్‌ ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాలు కలిసున్న ఈ జంట విడాకులు తీసుకోవడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.

#BREAKING : #ARRahman and his wife are separating after 29 years of marriage.. pic.twitter.com/QbTLzbhaMT— Ramesh Bala (@rameshlaus) November 19, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read