రాజ్ తరుణ్ అమ్మాయిలను చూస్తే ఎగురేసుకుపోతాడు అంటూ జబర్దస్త్ అప్పారావు చేసిన కామెంట్స్ రాజ్ తరుణ్ ను మరింత వార్తల్లో నిలిచేలా చేస్తుంది. ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో రాజ్ తరుణ్ హాట్ టాపిక్ అయ్యాడు. తనను మోసం చేసాడని..పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడని..ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కాదు కనీసం మాట్లాడడం కూడా లేడని లావణ్య అనే యువతీ పోలీస్ లకు పిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై గత రెండు రోజులుగా అంత మాట్లాడుకుంటున్నారు. ఇదే తరుణంలో జబర్దస్త్ అప్పారావు తిరగబడరా సామీ సినిమాలో రాజ్ తరుణ్ రోల్ కు సంబదించిన విషయం…ఇప్పుడు బయట జరుగుతున్న ఇష్యూ ఒక్కటే కావడం తో మరింతగా మాట్లాడుకుంటున్నారు.
తాజాగా అప్పారావు మాట్లాడుతూ..తిరగబడరా సామి చిత్రంలో మటన్ మస్తాన్ అనే పాత్రలో నటిస్తున్నాను. ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. ఇంత వరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. డైరెక్టర్ చెప్పినట్టే ఈ రోల్ చేశాను. నేను చేసినా.. డైరెక్టర్ చేసినట్టే స్క్రీన్ మీద అనిపిస్తుంది. ఈ మూవీ లో రాజ్ తరుణ్, మాళవిక మల్హోత్రా మధ్య కెమిస్ట్రీ బాగా ఉంటుంది. తిరగబడరా సామీ సినిమాలో రాజ్ తరుణ్, మాళవిక మల్హోత్రాతో కలిసి నటిస్తున్నాను. మాళవిక చాలా స్వీట్‌గా బబ్లీగా ఉంది. రాజ్ తరుణ్ అమ్మాయిలను చూస్తే ఎగురేసుకుపోతాడు. ఈ సినిమాలో మాళవిక, రాజ్ తరుణ్ మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. అలాగే నిర్మాత మల్కాపురం శివకుమార్ జహీరాబాద్ నుంచి మంచి బిర్యానీ పెట్టారు. అందుకు ధన్యవాదాలు అని జబర్దస్త్ అప్పారావు అన్నారు. తిరగబడరా సామీ సినిమాకు ఏఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.