News

వామ్మో..భారీగా పెరిగిన కల్కి టికెట్ ధరలు

సినీ లవర్స్ కు భారీ షాక్..రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కి టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి (Kalki 2898 AD) సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి సినిమాకు ప్రమోషన్స్ చేయకపోయినా ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదుర్స్ అనిపించడం ఖాయమని అంత భావిస్తున్నారు. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. జూన్ 27 పాన్ ఇండియా పలు భాషల్లో విడుదల కాబోతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను భారీగా పెంచారు.

టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలైన రోజు నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై 75 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో టికెట్‌పై 125 రూపాయలు పెంచేందుకు అనుమతిచ్చింది. రోజుకు 5 షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఈ మేరకు హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఉదయం తొలి ఆటకు వెళ్లాలని రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు, సామాన్య ప్రేక్షకులు రెడీ అవుతున్నారు. ఓవర్సీస్, అమెరికాతో పాటు తెలంగాణలో ‘కల్కి 2898 ఏడీ’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.