Monday, December 23, 2024
HomeMovie Newsరాజమౌళి దంపతులకు మరో అరుదైన గౌరవం

రాజమౌళి దంపతులకు మరో అరుదైన గౌరవం

- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈగ, బాహుబలి 1, 2 చిత్రాలతో తెలుగు సినిమాను ప్రపంచవేదికపై సగౌరవంగా నిలబెట్టారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా ఆస్కార్ అవార్డును దక్కించుకొని.. హాలీవుడ్​ అంతా మనవైపు తిరిగి చూసేలా చేశారు. అలాంటి రాజమౌళి కి అరుదైన గౌరవం దక్కింది.

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(AMPAS) సింపుల్‌గా చెప్పాలంటే ఆస్కార్స్ అకాడమీలో మెంబర్​గా ఉండేందుకు రాజమౌళికి ఆహ్వనం దక్కింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 57 దేశాల నుంచి 487 మందికి ఈ ఆహ్వానం దక్కగా, వీరిలో జక్కన్నతో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళికి కూడా అకాడమీ నుంచి ఆహ్వానం రావడం మరో విశేషం. దర్శకుల విభాగంలో రాజమౌళికి, కాస్టూమ్ డిజైనర్స్ కేటగిరీలో రమా రాజమౌళికి ఈ అరుదైన గౌరవం దక్కనుంది. దీంతో 2025 ఆస్కార్‌లలో ఓటు వేసేందుకు ఈ మెంబర్లంతా అర్హత పొందారు. కాగా, ఈ గౌరవం దక్కించుకున్న రాజమౌళి దంపతులకు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో SSMB 29 సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్​ జరుపుకుంటోంది. సెట్స్​పైకి ఎప్పుడు వెళ్తుందో స్పష్టంగా తెలీదు. ఫారెస్ట్ అడ్వెంచర్​ బ్యాక్​డ్రాప్​తో మూవీ తెరకెక్కనుంది. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read