Movie News

రష్మికకు బాలీవుడ్​లో మరో బంపర్​ ఆఫర్

గీత గోవిందం తో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న రష్మిక..ఆ తర్వాత వరుస చిత్రాలతో అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. ఇక పుష్ప మూవీ తో పాన్ ఇండియా స్టార్ అయ్యింది. పుష్ప దెబ్బ కు బాలీవుడ్ లో ఛాన్సులు దక్కించుకుంది. ఇక రణబీర్ తో చేసిన యానిమల్ మూవీ అమ్మడి జతకమే మార్చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీకి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.

తాజాగా ఆమె బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానాతో నటించేందుకు రెడీ అయినట్లు సమాచారం. ‘స్త్రీ’, ‘భేడియా’, ‘ముంజ్యా’ లాంటి సూపర్ హిట్​ హారర్‌ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దినేష్‌ విజన్‌ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇందుకోసం కొంత కాలంగా ఆయుష్మాన్​తో చర్చలు జరుపుతున్నారు. ఆదిత్య సత్పోదర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మడాక్‌ ఫిలిమ్స్‌ నిర్మాణ సంస్థలో రాబోతున్న ఈ సినిమాకు వాంపైర్స్‌ ఆఫ్‌ విజయ్‌నగర్‌ అనే పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం స్కిప్ట్‌ దశలో ఉందీ సినిమా. కాగా, రష్మిక చేతిలో చాలా సినిమాలున్నాయి. తెలుగులో పుష్ప-2, కుబేర, గార్ల్​ఫ్రెండ్‌, రెయిన్‌బో చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో సల్మాన్‌ఖాన్‌తో సికందర్ చేస్తోంది. ఎన్టీఆర్‌-ప్రశాంత్‌నీల్‌ కాంబోలోనే రష్మికనే నాయిక అని ప్రచారం సాగుతోంది.