Wednesday, December 18, 2024
HomeMovie Newsపటాస్ డైరెక్టర్​తో చిరంజీవి..?

పటాస్ డైరెక్టర్​తో చిరంజీవి..?

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో బిజీ కాబోతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా టాక్ నడుస్తోంది. పటాస్ , భగవంత్ కేసరి, ఎఫ్ 3 వంటి హిట్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడితో చిరంజీవి ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించనున్నట్లు సమాచారం.

ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన కథాంశంతో మరియు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనుందని అంటున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక చిరంజీవి ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ యాక్షన్ చిత్రం చేయనున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు. నాని సమర్పణలో తెరకెక్కనున్న ఈ చిత్రం కూడా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని సమాచారం. అయితే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది.

ఇక అనిల్ రావిపూడి ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి సినిమాల తరువాత వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read