తన అన్న విజయ్ దేవరకొండ ను తొక్కేయాలని చూస్తున్నారంటూ ఆనంద్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేసారు. ” ది ఫ్యామిలీ స్టార్ ” మూవీ ఏప్రిల్ 5న ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై కొందరు కావాలని నెగెటివ్‌గా ప్రచారం చేశారు. ఫ్యామిలీ స్టార్‌లోని మిస్టేక్ అనిపించిన సీన్స్, ఫోటోలు, స్క్రీన్ షాట్లను తీసుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసారని ఆనంద్ తెలిపాడు. బేబీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ నటించిన ”గం గం గణేశా ” మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ ఓ దొంగగా కనిపిస్తున్నాడు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆనంద్ మాట్లాడుడ్తూ..ఫ్యామిలీ స్టార్ సినిమాను కొన్ని ఏరియాలలో కావాలని టార్గెట్ చేసి నెగెటివిటీ స్ప్రెడ్ చేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరు వ్యక్తిగతంగా వారి మనసులో ఉన్న అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదని.. కానీ ఒక గ్రూపుగా మారి, ట్రెండ్ నడిపి ఫ్యామిలీ స్టార్‌ని చంపేసే ప్రయత్నం చేశారని ఆనంద్ వ్యాఖ్యానించారు. సినిమా రిలీజ్ కావడానికి 48 గంటల ముందే విజయ్ నటించిన పాత సినిమాల నెగిటివ్ టాక్ తీసుకొచ్చి.. ”ఫ్యామిలీ స్టార్ పబ్లిక్ టాక్” అనే థంబ్‌నెయిల్స్ పెట్టి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేశారని మండిపడ్డారు. నిర్మాతను, ట్రేడ్‌ను, బిజినెస్‌ను భయపెట్టాలని ఓ గ్రూప్ చేస్తోందని ఆనంద్ తెలిపారు. వాళ్లు ఎవరు..? ఎందుకు ఇదంతా చేస్తున్నారు..? అనేది కేవలం సైబర్ క్రైమ్ సెల్ మాత్రమే తేల్చగలదని ఆయన చెప్పారు.