Tuesday, December 24, 2024
Homeతెలుగు వార్తలుబాలీవుడ్‌లో రెండు భారీ చిత్రాల్లో హీరోయిన్‌గా హైదరాబాద్‌ అమ్మాయి అమ్రిన్‌ ఖురేషి..

బాలీవుడ్‌లో రెండు భారీ చిత్రాల్లో హీరోయిన్‌గా హైదరాబాద్‌ అమ్మాయి అమ్రిన్‌ ఖురేషి..

పక్కా హైదరాబాద్‌ అమ్మాయి, సికింద్రాబాద్‌ శివశివాని పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్న అమ్రిన్‌ ఖురేషి ఒకేసారి రెండు హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించడం అనేది ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌ అయింది. ఈ రెండు హిందీ చిత్రాలు తెలుగులో సూపర్‌హిట్‌ అయిన ‘సినిమా చూపిస్త మావ’, ‘జులాయి’ రీమేక్స్‌ కావడం విశేషం. ఇటు గ్లామర్‌ రోల్స్‌కి, అటు ట్రెడిషనల్‌ క్యారెక్టర్స్‌కి సూట్‌ అయ్యే అమ్రిన్‌కి బ్రైట్‌ ఫ్యూచర్‌ ఉంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. హిందీ చిత్రాలు నిర్మాణంలో ఉండగానే తెలుగు, తమిళ భాషల్లో భారీ చిత్రాల్లో అమ్రిన్‌ ఖురేషికి ఆఫర్స్‌ రావడం చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతోంది. హిందీ చిత్రాల్లో విజయాలు సాధించి తెలుగు, తమిళ్‌తోపాటు అన్ని సౌత్‌ లాంగ్వేజెస్‌లో హీరోయిన్‌గా విజయాలు సాధించాలన్నది అమ్రిన్‌ లక్ష్యం.

రేఖ, హేమమాలిని, శ్రీదేవి, జయప్రద, వహీదా రెహమాన్‌, టబు వంటి హీరోయిన్లు తెలుగు సినిమాలతో పరిచయమై ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి టాప్‌ రేంజ్‌కి వెళ్ళడమే కాకుండా హీరోయిన్లుగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో ఎంతో మంది బాలీవుడ్‌ స్టార్స్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ల విషయంలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌కి భిన్నంగా హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్‌’ డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ సాజిద్‌ ఖురేషి కుమార్తె, రాయల్‌ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌ అధినేత ఎమ్‌.ఐ.ఖురేషి మనవరాలు అమ్రిన్‌ ఖురేషి ఒకేసారి రెండు బాలీవుడ్‌ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో సూపర్‌హిట్‌ అయిన ‘సినిమా చూపిస్త మావ’, ‘జులాయి’ సినిమాలు హిందీలో రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే.

ఈ రెండు సినిమాల్లోనూ అమ్రిన్‌ ఖురేషి హీరోయిన్‌గా నటిస్తోంది. ‘సినిమా చూపిస్త మావ’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ‘బ్యాడ్‌బాయ్‌’ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్‌బాక్స్‌ పిక్చర్స్‌ పతాకంపై సాజిద్‌ ఖురేషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన సూపర్‌హిట్‌ మూవీ ‘జులాయి’ రీమేక్‌గా రూపొందుతున్న సినిమాకి సూపర్‌ డైరెక్టర్‌ టోని డిసౌజ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రం షూటింగ్‌ జనవరిలో ప్రారంభం కానుంది. ఈ రెండు సినిమాల్లోనూ బాలీవుడ్ స్టార్ మిథున్ చ‌క్ర‌వ‌ర్తి త‌న‌యుడు న‌మ‌షి చ‌క్ర‌వ‌ర్తి హీరోగా న‌టిస్తున్నారు. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కి హీరోయిన్లు వస్తున్న ఈ సీజన్‌లో హైదరాబాద్‌ నుండి బాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమవుతున్న అమ్రిన్‌ ఖురేషి త్వరలోనే తెలుగులో కూడా హీరోయిన్‌గా బిజీ అవుతుందని ఆశిస్తూ ఆల్‌ ది బెస్ట్‌.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read