Tuesday, December 24, 2024
Homeతెలుగు వార్తలుఅమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజ్ అవుతున్న తెలుగు చిత్రం "పెంగ్విన్"

అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజ్ అవుతున్న తెలుగు చిత్రం “పెంగ్విన్”

జూన్ 19 నుంచి ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో లో “కీర్తి సురేశ్ – పెంగ్విన్”

- Advertisement -

మ‌హాన‌టి సినిమాతో ఎంత‌గానో పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకొని, తెలుగు ప్రేక్షకుల‌కి అత్యంత‌గా చేరువైన న‌టి కీర్తి సురేశ్. ఇటీవ‌లే నేష‌న‌ల్ అవార్డ్ ని కూడా కైవ‌సం చేసుకున్నారు. మ‌హాన‌టి త‌రువాత కీర్తి న‌టించిన మ‌రో అద్భుత‌మైన సినిమా పెంగ్విన్. ఆస‌క్తిక‌ర క‌థ‌, క‌థ‌నంతో సాగిపోయే ఈ చిత్రానికి ఈశ్వ‌ర్ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్ ప‌తాకం పై కార్తీక్ సుబ్బ‌రాజ్ ఈ సినిమాను నిర్మించారు. ఇక మ‌హాన‌టి చిత్రానికి థియేట‌ర్ లోనే కాదు వ‌ర‌ల్డ్ బెస్ట్ ఆన్ లైన్ స్టీమింగ్ నెట‌వ‌ర్క్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా విశేష ఆద‌ర‌ణ ల‌భించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పెంగ్విన్ చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఎక్స్ క్లూజివ్ గా ఆడియోన్స్ కి అందిచ‌బోతున్నారు. ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ లోనే జాన్ 19న‌ విడుద‌ల చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమా పెంగ్వీన్ కావడం విశేషం. అలానే అమెజాన్ ప్రైమ్ కి సంబంధించిన డైరెక్ట్ టు సర్వీస్ స్లేట్ లో దీనితో పాటు మ‌రికొన్ని ఇత‌ర భాష చిత్రాన్ని ఎక్స్ క్లూజివ్ గా రిలీజ్ చేస్తున్నారు. పెంగ్విన్ తో క‌లిపి మొత్తం ఆరు సినిమాల‌ను నేరుగా త‌మ స్ట్రీమింగ్ స‌ర్వీస్ పై ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లుగా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా

అమెజాన్ ప్రైమ్ వీడియో డైరెక్టర్, కంటెంట్ హెడ్ విజయ్ సుబ్రమణియం మాట్లాడుతూ,

‘‘అమెజాన్ లో మేము మా వినియోగదారుల మాట వింటాం, ఆ దిశగా మేము పని చేస్తాం’’ అని అన్నారు. ‘‘గత 2 ఏ ళ్లుగా వివిధ భాషల్లో, థియేటర్లలో విడుదలైన కొద్ది వారాలకే కొత్త రిలీజ్ లను చూసేందుకు గమ్యస్థానంగా ప్రైమ్ వీడియో రూపుదిద్దుకుంది. ఇప్పుడు మేము మరో అడుగు ముందుకేశాం. అంతా ఎంతగానో చూస్తు న్నఏడు భారతీయ సినిమాలను ఎక్స్ క్లూజివ్ గా ప్రైమ్ వీడియోపై ప్రసారం చేయనుంది, సినిమాటిక్ అనుభూతిని వారి ఇళ్ల ముంగిళ్లలోకి తీసుకురానుంది’’ అని అన్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, కంట్రీ జనరల్ మేనేజర్ గౌరవ్ గాంధీ మాట్లాడుతూ,

‘‘ఎంతగానో చూడాలనుకుంటున్న ఈ 7 సినిమాల విడుదల కోసం భారతీయ వీక్షకులు ఎంతో ఆ త్రంగా ఎదురుచూస్తున్నారు. మా వినియోగదారుల కోసం వీటిని ఇప్పుడు మేము ప్రసారం చేయడం మా కెంతో ఆనందదాయకం. వీటిని మా వీక్షకులు ఇంట్లోనే సురక్షితంగా, సౌకర్యవంతంగా తాము ఎంచుకున్న స్క్రీన్ పై చూడవచ్చు. 4000కు పైగా పట్టణాలు, నగరాలలో వీక్షణంతో భారతదేశంలో ఎంతగానో చొచ్చుకు పోయిన ప్రైమ్ వీడియో ఇప్పుడు 200కు పైగా దేశాలు, టెరిటరీస్ లలో అందుబాటులో ఉంది. ఈ సినిమా ల కు అంది అంతర్జాతీయ రిలీజ్ ముద్రను అందించనుంది. ఈ కార్యక్రమం పట్ల మేమెంతో ఉద్వేగంగా ఉన్నాం. ఇది మా ప్రైమ్ సభ్యులను ఆనందపరుస్తుందని మేము విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read