శివకార్తికేయన్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన అమరన్ (Amaran) చిత్రం సరికొత్త రికార్డ్స్ నెలకొల్పుతుంది. మేజర్ ముకుంద్ జీవితంలో కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకొని, త్రీలింగ్ మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 31న భారీ అంచనాల నడుమ విడుదలై, అన్ని భాషల్లో మంచి హిట్ టాక్‌ను సంపాదించింది. మొదటి మూడు వారాల్లోనే ఈ చిత్రం రూ. 300 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి.. శివకార్తికేయన్ కెరీర్‌లో అత్యుత్తమ విజయాల్లో ఒకటిగా నిలిచింది.
కంగువ వంటి భారీ అంచనాల సినిమాల విడుదల తర్వాత కూడా అమరన్ ప్రేక్షకుల మెయిన్ ఛాయిస్‌గా నిలవడం విశేషం. తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూవీ తో తెలుగు లోను శివకార్తికేయన్ ఫ్యాన్‌బేస్ పెరిగింది. రాజ్‌కుమార్ పెరియసామి SK21గా ఈ సినిమాను వినూత్నమైన కోణంలో తెరకెక్కించారు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలో ప్రధాన బలంగా నిలిచింది. విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ విలన్ పాత్రలో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. శివకార్తికేయన్‌కి ఈ విజయం మరో స్థాయి గుర్తింపు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించింది.