అల్లు అర్జున్ – సుకుమార్ మధ్య విభేదాలు వచ్చాయా..? అందుకే బన్నీ తన లుక్ ను మార్చాడా..? పుష్ప 2 షూటింగ్ కు బ్రేక్ పడడానికి విభేదాలే కారణమా..? ఇప్పుడు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. బన్నీ – సుకుమార్ కలయికలో పుష్ప 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నా ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయాలనీ భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడం తో విడుదల తేదీని డిసెంబర్ 06 కు వాయిదా వేశారు.
షూటింగ్‌కు గ్యాప్ దొరకడంతో బన్నీ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిపోయాడు. ఆదివారం నాడు బన్నీ రిటర్న్ అయ్యాడు. అయితే ఎయిర్ పోర్టులో బన్నీ లుక్ చూసి అంతా షాక్ అయ్యారు. బన్నీ గడ్డం తీసేశాడు. తన గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నాడు. పుష్ప స్టైల్లో కనిపించడం లేదు. ఐకాన్ స్టార్ గెడ్డం పెరగాలంటే.. కనీసం 1 నెల పడుతుంది. ఆ తర్వాత ఈ సినిమా 1 నెల నుంచి నెలన్నర షూటింగ్ ఉంటుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌కు మరో నెల ఉంటుంది. ప్రమోషన్స్, తదితర కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది అనే వార్త చక్కర్లు కొడుతున్నది.
బన్నీ ఏమో పుష్ఫను మూడు టీంలుగా విడగొట్టి షూట్ చేయాలని అంటున్నాడట.. కానీ సుక్కు ఏమో అవన్నీ వద్దని అంటున్నాడట. అలా ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. బన్నీ ఇలా గడ్డం లేకుండా కనిపించడంతో ఇప్పుడు ఎలా షూట్ చేయాలని సుక్కు అన్నాడట. దీంతో సుక్కు హర్ట్ అయి అమెరికాకి వెళ్లిపోయాడని అంటున్నారు. ఇందులో ఏ వార్త నిజం అనేది తెలియాల్సి ఉంది.