Friday, October 18, 2024
HomeMovie Newsనెల్సన్ డైరెక్షన్లో అల్లుఅర్జున్ సినిమా?

నెల్సన్ డైరెక్షన్లో అల్లుఅర్జున్ సినిమా?

- Advertisement -

తమిళ డైరెక్టర్ నెల్సన్తో అల్లు అర్జున్ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘ పుష్ప: ది రూల్’ చేస్తున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ రూ. 400కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ డిసెంబర్ 6న ఈ మూవీ విడుదల కానుంది.

ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారనే చర్చ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో జరుగుతోంది. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో కొత్త సినిమాలకు అల్లు అర్జున్ ఆల్రెడీ కమిట్ అయినప్పటికీ ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం ఉంది. ఈలోగా మరో దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేయాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలో తాజాగా జైలర్ ఫేమ్ నెల్సన్ చెప్పిన కథ కు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల హైదరాబాద్ లో స్టోరీ డిస్కషన్స్ జరగగా, నెల్సన్ చెప్పిన స్టోరీ బన్నీకి నచ్చిందని సమాచారం. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని డైరెక్టర్కు ఐకాన్ స్టార్ సూచించారట. ఈ మూవీపై ఈ ఏడాది చివర్లో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read