Movie News

కల్కి మూవీ పుష్పరాజ్ కామెంట్స్

అందరు ఊహించినట్లే కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అద్భుతం అంటూ కితాబ్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా..తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం కల్కి ఫై కామెంట్స్ చేసారు. మన భారతీయ చరిత్రను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇలా తీయడం అద్భుతం అంటూ ప్రశంసించారు. కల్కి మూవీలో ప్రతి ఫ్రేమ్ ఒక వండర్‌లా ఉందంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

‘కల్కి టీమ్‌కు అభినందనలు. ఈ సినిమా ఓ విజువల్ స్పెక్టకిల్. సూపర్ హీరో పాత్రలో మిత్రుడు ప్రభాస్ అదరగొట్టేశారు. అమితాబ్ జీ మీరు నిజంగా మా అందరికీ ఇన్‌స్పిరేషన్. మీ గురించి చెప్పడానికి మాటల్లేవ్. కమల్ హాసన్ సార్, మిమ్మల్ని తరువాతి పార్ట్‌లో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో దీపిక పదుకొణె స్టన్నింగ్ పెర్ఫామెన్స్ చేసింది. దిశా పటానీ తెరపై ఆకర్షణీయంగా కనిపించావు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన మిగతా నటీనటులకి, టెక్నికల్ టీమ్‌కి మరీ ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిట్, మేకప్ డిపార్ట్​మెంట్​లో పనిచేసిన వారికి నా అభినందనలు.

భారతీయ సినిమా స్థాయిని పెంచేందుకు ఇంత రిస్క్ తీసుకొని చిత్రాన్ని నిర్మించిన వైజయంతీ ఫిలిమ్స్ అధినేత అశ్వినీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్‌కు సెల్యూట్. ఫైనల్​గా ప్రేక్షకులతో వావ్ అనిపించిన కెప్టెన్ నాగ్ అశ్విన్‌, నిజంగా ఈ జనరేషన్‌కు ఓ పాత్ బ్రేకింగ్ డైరెక్టర్. చివరకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో వచ్చిన సినిమా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మ్యాచ్​ చేసింది.” అంటూ అల్లు అర్జున్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

గత కొద్దీ నెలలుగా ఎప్పుడెప్పుడు చూద్దామా..అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న కల్కి మూవీ ..గురువారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కల్కి మేనియా నడిచింది. వరల్డ్​ వైడ్​గా దాదాపు 10 వేలకుపైగా స్క్రీన్స్​లో సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్ దీపికా పదుకొనే కమలహాసన్ వంటి స్టార్ కాస్ట్ నటించారు. వీళ్లే కాకుండా చాలామంది దర్శకులు కూడా ఈ సినిమాలో కొన్ని పాత్రల్లో కనిపించారు.