మొన్నటి వరకు మెగా – అల్లు ఫ్యామిలీ అంటే ఒకటే అనుకునే వారు..కానీ ఇప్పుడు అల్లు అర్జున్ వల్ల ఈ రెండు ఫ్యామిలీలలో విభేదాలు నడుస్తున్నాయని అంటున్నారు. ఈ విభేదాలను తగ్గించే పనిలో అల్లు అరవింద్ పడ్డారని అంటున్నారు. ఇంట్లో వాళ్ళని కాదని స్నేహితుడు ఇతర పార్టీ వ్యక్తి దగ్గరకి వెళ్లి బన్నీ ప్రచారం చేయడం పెను దుమారమే రేపింది.
దీనితో అల్లు అర్జున్ పై చాలా నెగిటివ్ వచ్చింది. దీనితో మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ వేరయ్యాడు అనేది కూడా వినిపించింది. దీనికి తోడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో తిరస్కరించడం కూడా వైరల్ గా మారగా వీటి అన్నిటికి ఇప్పుడు అల్లు అర్జున్ తండ్రి టాలీవుడ్ దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ బలైనట్టు తెలుస్తుంది.
బన్నీ చేసిన డ్యామేజ్ మరింత ఎక్కువ కాకుండా వెంటనే పవన్ ని కలిసి అల్లు, మెగా విడిపోలేదు అనే విధంగా ప్రొజెక్ట్ చేసే పనిలో పడ్డారని కొందరు అంటున్నారు. అంతే కాకుండా నిన్న మీటింగ్ లో కూడా పవన్ తో అల్లు అర్జున్ కాంట్రవర్సీ కోసం కూడా చర్చించారనీ కొన్ని గుసగుసలు ఉన్నాయి. వీటితో అయితే అల్లు అర్జున్ చేసిన పని మెగా, అల్లు అభిమానుల మధ్య చిచ్చు పెట్టింది. అయితే అది పెద్దది కాక ముందే కంట్రోల్ చేసే భాద్యత మాత్రం అల్లు అరవింద్ పైనే పడింది అని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.