చిత్రసీమలో డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరి..ప్రస్తుతం హిట్ కోసం తహతలాడుతున్నాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేకపోవడం తో ఆయనకు ఛాన్సులు ఇచ్చేందుకు కూడా ఎవ్వరు ముందుకు రావడం లేదు. ఆ మధ్య ఇస్మార్ట్ శంకర్ తో తన మార్క్ చూపించిన పూరి..ఆ తర్వాత లైగర్, ఇస్మార్ట్ శంకర్ 2 లు రెండు కూడా భారీ డిజాస్టర్లు కావడం తో ఇక పూరి కి ఎవ్వరు ఛాన్స్ ఇవ్వరని అంత మాట్లాడుకోవడం మొదలువ్ట్టారు.
ఈ తరుణంలో పూరికి అక్కినేని నుండి పిలుపు వచ్చిందనే వార్త ఆయన అభిమానుల్లో సంబరాలు నింపుతుంది. ఇక అక్కినేని కాంపౌండ్‌లో కూడా ఈమధ్య హిట్లు అనేవి కరువైపోయాయి. సంక్రాంతికి నా సామిరంగాతో సందడి చేసిన నాగార్జున ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర చిత్రంలో నటిస్తున్నారు. నాగచైతన్యకు ఈమధ్యకాలంలో హిట్స్ లేవు. ఇక అఖిల్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు ఓ అరడజను సినిమాలు చేసినా ఒక్కటి కూడా విజయం సాధించలేదు. అతని చివరి సినిమా ఏజెంట్ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సమయంలో పూరి జగన్నాథ్ వంటి డైరెక్టర్ అయితేనే తమని ఫ్లాపుల నుంచి గట్టెక్కించగలరని అక్కినేని హీరోలు భావిస్తున్నట్టున్నారు. అందుకే అక్కినేని ఫ్యామిలీలోని ముగ్గురు హీరోలలో ఎవరికైనా సెట్ అయ్యే కథ రెడీ చేస్తే సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం పూరి అదే పనిలో ఉన్నారని సమాచారం.