Tuesday, December 24, 2024
HomeMovie News'OG ' కోసం వెయిటింగ్ అంటున్న అకిరా

‘OG ‘ కోసం వెయిటింగ్ అంటున్న అకిరా

- Advertisement -

పవన్ – సుజిత్ కలయికలో OG మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులు , సినీ ప్రముఖులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ చాలా గ్యాప్ తర్వాత స్ట్రైట్‌గా సినిమా చేస్తుండటం వల్ల ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఫ్యాన్స్​, ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. ఇందులో పవన్ కొడుకు అకీరా నందన్ కూడా ఉన్నాడట.

యంగ్ హీరో అడివి శేష్ రీసెంట్​గా ఓ సందర్భంలో OG సినిమా గురించి మాట్లాడారు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని బయటపెట్టారు. ‘సిల్వర్ స్క్రీన్‌పై ఈ సూపర్ ఎగ్జైటెడ్ సినిమాను చూసేందుకు పడి చచ్చిపోతున్నాడు అకీరా. వాళ్ల నాన్నను గ్యాంగ్‌స్టర్‌గా చూడటానికి చాలా ఎగ్జైట్ అవుతున్నాడు’ అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అడివి శేష్‌- అకీరాకు మధ్య చాలా క్లోజ్ బాండింగ్ ఉంటుంది. వారిద్దరూ ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో షేర్ చేసుకున్నారు కూడా. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్​ సినిమాగా ఇది తెరకెక్కుతుంది. ఇక త్వరలోనే సినిమా షూటింగ్​లో హీరో పవన్ పాల్గొననున్నారట.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read