Movie News

వైరల్ : ‘OG’ లో అకీరా నందన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజిత్ కలయికలో OG మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ఫేమ్ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఫై అంచనాలు తారాస్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి కావాల్సి ఉండగా..పవన్ పాలిటిక్స్ లో బిజీ గా ఉండడం తో షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది.

ఇదిలా ఉంటె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమా ద్వారా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. అకీరా తన తండ్రితో కలిసి నటించనున్నారని తెలియడంతో అభిమానులు ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేస్తున్నారు.