అక్కినేని అఖిల్ తన తొలి సినిమా ‘అఖిల్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, కమర్షియల్ సక్సెస్ కోసం కొన్ని ప్రయత్నాలు చేసినా, ఇంకా బలమైన హిట్ అందుకోలేకపోయారు. ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, ‘ఏజెంట్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా ‘ఏజెంట్’ చిత్రం అతనికి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
ఈ నేపధ్యంలో, అఖిల్ కొంతకాలంగా కొత్త ప్రాజెక్టులను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే, ఇప్పుడు ఈ అక్కినేని వారసుడు రెండు సినిమాలకు పచ్చజెండా ఊపాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘ధీర’ చిత్రంలో అఖిల్ నటించనున్నాడు, ఈ సినిమాకు అనిల్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మరో చిత్రం ఆయన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌లో రూపొందనుంది, దీని దర్శకత్వం ‘వినరో భాగ్యం విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు వహించనున్నాడు. ఈ రెండు సినిమాలూ వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.