ఆకాశ్ పూరి, కేతికా శర్మజంటగా నటిస్తున్న చిత్రం రొమాంటిక్. అనిల్ పాదూరి దర్శకుడు. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై  పూరి జగన్నాథ్, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో ఆకాశ్, హీరోయిన్ కేతికా శర్మను కౌగిలించుకున్న స్టిల్‌ను ఫస్ట్ లుక్‌గా విడుదల చేశారు. ఇప్పటికే సినిమా హైదరాబాద్, గోవా షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. సోమవారం నుండి కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోనే ప్రారంభం కానుంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నరేశ్ సినిమాటోగ్రఫీని అందించారు. 
నటీనటులు
ఆకాష్ పూరి, కేతిక శర్మ, మందిరా బేడి, మకరంద్ దేశ్ పాండే తదితరులు
సాంకేతిక నిపుణులు
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు:  పూరి జగన్నాథ్
దర్శకత్వం: అనిల్ పాదూరి,
నిర్మాతలు:  పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్
సంస్థలు:  పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్
సమర్పణ:  పూరి లావణ్య
మ్యూజిక్:  సునీల్ కశ్యప్
కెమెరా: నరేశ్
ఎడిటర్:  జునైద్ సిద్దికీ
ఆర్ట్:  జొన్ని షేక్
పాటలు:  భాస్కర భట్ల
ఫైట్స్:  రియల్ సతీశ్
పి.ఆర్.ఒ:  వంశీ శేఖర్