ఇటీవల థియేటర్స్ లలో విడుదలైన పెద్ద, చిన్న సినిమాలు 20 రోజులకే ఓటిటి లో దర్శనం ఇస్తుంటే..అఖిల్ నటించిన ఏజెంట్ మూవీకి మాత్రం ఇప్పుడు మోక్షం కలిగింది. గతేడాది ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఏజెంట్ కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు పెట్టారు. అఖిల్ కూడా తన బీస్ట్ మోడ్‌లోకి మారడానికి చాలా రోజులు జిమ్ కష్టపడ్డారు. అప్పట్లో అతడి లుక్ చూసి అంతా మూవీ హిట్ అనుకున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ఊహించని పరాజయం అందుకుంది.
అలా థియేటర్లో ఈ కథ, కథనం విషయంలో, యాక్షన్ సీక్వెన్స్‌లో టేకాఫ్ విషయంలో డైరెక్టర్ తడబాడ్డాడని, దాంతో అవి కథకు ఆప్ట్ కాలేదంటూ ఆడియన్స్ నుంచి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే మూవీకి నెగిటివ్ రివ్యూస్ రావడంతో చాలా మంది సినిమను చూసేందుకు ఆసక్తి చూపలేదు. ఇక ఓటీటీకి వస్తే చూద్దామని ఎదురుచూస్తున్న ఆడియన్స్‌కి తరచూ నిరాశే ఎదురవుతుంది. ఈ ఏడాది జనవరిలో వస్తుందంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. అది ప్రచారానికే పరిమితం అయ్యింది. తాజాగా ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ సోనీ లివ్ కొత్త ప్రకటన ఇచ్చింది. ఈ సినిమాను సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్‌కి ఇవ్వనున్నట్టు సోనీ లివ్ ప్రకటించింది. మరి చూడాలి ఈ సారైనా ఈ చిత్రంగా విడుదలవుతుందా? లేదా అనేది.