Friday, November 22, 2024
HomeMovie Newsపవన్ కళ్యాణ్ ఫై లయ ప్రశంసలు

పవన్ కళ్యాణ్ ఫై లయ ప్రశంసలు

- Advertisement -

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ప్రశంసల జల్లు కురిపించారు సీనియర్ నటి లయ. ఇటీవల లయ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కెరియర్ పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని అమెరికా లో స్థిరపడిన ఈమె..ఇప్పుడు ఇండియా కు వచ్చి వరుస ఇంటర్వ్యూ లతో హడావిడి చేస్తుంది. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ఫై ప్రశంసలు కురిపించింది.

పవన్ కళ్యాణ్ స్పీచ్‌లు ఇష్టమని, ప్రతినిత్యం రాజకీయ నాయకులు మాట్లాడినట్లుగా కాకుండా ఫ్రెష్‌గా, కొత్తగా పవన్ ఉపన్యాసాలు ఉంటాయన్నారు. ఆయన ఆహ్వానిస్తే పార్టీలో చేరడానికి సిద్దం. కానీ నన్నెందుకు పార్టీలోకి పిలుస్తారు. గతంలో నేను రామానాయుడు, ఇతర సినీ ప్రముఖులకు ఆంధ్రాలో ప్రచారం చేశాను. ఎవరైనా తనను ప్రచారం చేయమని అడిగితే.. ఆలోచిస్తాను అని తన రాజకీయ ఎంట్రీ ఫై క్లారిటీ ఇచ్చింది. పవన్ రాజకీయ నాయకుడిలా కనిపించరా అని యాంకర్ ప్రశ్నించగా.. ఆయన సిన్సియర్‌గా ట్రై చేస్తున్నారని అనిపిస్తుందన్నారు. వేరొకరిని అనుకరించకుండా రాజకీయ నాయకుడంటే ఇలా కూడా ఉంటారా అనిపించేలా పవన్ వ్యక్తిత్వం ఉంటుందని లయ ప్రశంసించారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read