Movie News

యాంకర్ శ్యామల ఫై నటుడు సమీర్ ఆగ్రహం

పవన్ కళ్యాణ్ తో పెట్టుకోకూడదు..పెట్టుకుంటే అంతే సంగతి అని చాలామందికి తెలుసు..అయినాగానీ కొంతమంది అత్యుత్సహం ప్రదర్శించి తమ కెరియర్ నాశనం చేసుకుంటారు. గత ఎన్నికల సమయంలో నటుడు అలీ అలాగే చేసి కెరియర్ ను దెబ్బ తీసుకోగా..ఈసారి యాంకర్ శ్యామల అలాగే చేసుకుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో ఎటువంటి పదవులు లేక ముందే చాలామందిని ఆదరించారు పవన్ కళ్యాణ్. ఎంతోమందికి తన వంతు సాయాన్ని కూడా చేశారు. ఒక సందర్భంలో పవర్ స్టార్ గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ తాను చేసిన ప్రతి సాయాన్ని ఒక ఆడియో వేడుకలో వివరిస్తూ వచ్చారు. ఎక్కడ ఏ విషయం జరిగిన చాలా త్వరగా పవన్ కళ్యాణ్ వాళ్ల గురించి తెలుసుకొని మరి స్పందిస్తారు. 2024లో పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో చాలా కీలకపాత్రను పోషించారు. ఈ ఎలక్షన్ టైం లో కూడా చాలామంది పవన్ కళ్యాణ్ విమర్శించారు అందులో బుల్లితెర యాంకర్ శ్యామల కూడా ఒకరు.

రాజకీయాలంటే ప్రజాసేవ అని పవన్ కళ్యాణ్ ఎవరికి సాయం చేసినట్లు నేనైతే చూడలేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే దీనిపై రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నటుడు సమీర్ స్పందించాడు. ఒక సో కాల్డ్ యాంకర్ తను నాకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ సాయం చేసినట్లు చూడలేదు అంటూ చెప్పింది. కానీ నేను కళ్ళారా చూసిన ఒక విషయాన్ని మీతో చెప్తున్నాను. ఆయన ఒక న్యూస్ పేపర్లో ఒక విషయం చదివి ఎక్కడో విజయనగరంలో ఉన్న ఒక ఫ్యామిలీకి తన మేనేజర్ సహాయంతో సహా అందించారు అది పవన్ కళ్యాణ్ అంటే అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Actor Sameer Garu Slipper shot to anchor shyamala 👌pic.twitter.com/Ro5itaxL2l— Pawan Kalyan Holics™ (@PSPKHolics) July 4, 2024