News

‘ఓదెల 2’లో శివశక్తి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం – తమన్నా

తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్  క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. ఈ చిత్రాన్ని గ్రాండ్ పాన్-ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు, సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్ గా మల్టిపుల్ రోల్స్ లో వర్క్ చేశారు.అలాగే డైరెక్షన్ సూపర్ విజన్ ని అందిస్తున్నారు. అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్  బ్యానర్స్ పై డి. మధు  నిర్మిస్తున్నారు. టీజర్, మిగతా ప్రమోషనల్ కంటెంట్ కి ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు, ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ఈ ట్రైలర్ పవర్ ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమవుతుంది, ఇది ఓదెల గ్రామంపై పొంచి ఉన్న ముప్పుకు సూచిస్తోంది. ఇది ఒక దుష్ట శక్తి గురించి చెబుతుంది. విధ్వంసక శక్తిని విడుదల చేయడానికి సరైన క్షణం కోసం వేచి ఉంది. చెడు శకునాలు కనిపించడం ప్రారంభించగానే, గ్రామస్తులు భయంతో మునిగిపోతారు, చీకటి నెమ్మదిగా తమ జీవితాలను ఆవరిస్తోందని గ్రహిస్తారు. పెరుగుతున్న ఈ భయం మధ్యలో ఒక నాగ సాధువు వస్తోంది. అచంచలమైన దృఢ సంకల్పంతో ఆమె చెడును ఎదుర్కోవాలని ప్రతిజ్ఞ చేస్తుంది, మంచి, చెడు శక్తుల మధ్య ఒక ఎపిక్ వార్ ని ప్రామిస్ చేస్తోంది.

మేకర్స్ బిగ్ స్టొరీ ని బిగ్ స్కేల్ లో ప్రజెంట్ చేశారు. సంపత్ నంది రైటింగ్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది,  అశోక్ తేజ బిగ్ కాన్వాస్‌ పై అద్భుతంగా ప్రజెంట్ చేశారు. కథాంశాన్ని రివిల్ చేయడంతో పాటు, ట్రైలర్ ప్రధాన పాత్రలను కూడా పరిచయం చేస్తుంది. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత వుంది.

నాగ సాధువుగా తమన్నా భాటియా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. క్యారెక్టర్ కు సహజత్వం, ఇంటన్సిటీని తీసుకొచ్చింది. మరోవైపు, వశిష్ట ఎన్ సింహ పాత్ర దుష్ట శక్తిగా భయాన్ని కలిగిస్తుంది, ప్రతి సన్నివేశంలో తన ప్రజెన్స్ టెర్రిఫిక్ గా వుంది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్,  పూజా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్  ప్రతి సెట్ ని అద్భుతంగా మలచి విజువల్ ఎక్స్ పీరియన్స్ ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ ఎస్ అద్భుతమైన విజువల్స్‌తో సినిమా కోసం నిర్మించిన ప్రపంచాన్ని అద్భుతంగా చూపించారు. బి అజనీష్ లోక్‌నాథ్  ఎక్సయిటింగ్  స్కోర్ ప్రతి సన్నివేశంకు ప్రాణం పోసింది. VFX వర్క్ అత్యున్నతంగా వుంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ సినిమా మొత్తం ఇంపాక్ట్ ని పెంచు వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాని నిర్మించారు. ఈ అద్భుతమైన ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఏప్రిల్ 17న థియేటర్లలోకి వచ్చే ఈ విజువల్ వండర్ ని ఎక్స్ పీరియన్స్ చేయడానికి ఎక్సయిట్మెంట్ మరింతగా పెరిగింది.  

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇలాంటి సినిమాలు ఒక యాక్టర్ కి చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాలో పార్ట్ కావడం ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. సంపత్ నంది గారు ఈ సినిమాలో నా పాత్రని రాసిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి కథలో నన్ను పార్ట్ చేసిన సంపత్ నంది గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వశిష్ట సింహ చాలా అద్భుతమైన నటుడు. ఈ సినిమాల్లో తన పాత్ర టెర్రిఫిక్ గా ఉంటుంది. గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ ని తన పెర్ఫార్మన్స్ తో మరో స్థాయికి తీసుకువెళ్లాడు. ఈ సినిమాలో నేను చేసిన శివశక్తి పాత్రకు ఎలాంటి రిఫరెన్స్ లేదు. ఈ సినిమా కోసం నేచర్ కూడా మాకు సపోర్ట్ చేసిందని నమ్ముతున్నాం. ఈ సినిమా నాకు చాలా డిఫరెంట్ జర్నీ. ఇది గ్రాండ్ స్కేల్ కమర్షియల్ ఫిల్మ్.  ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది.  

మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ.. ఇలాంటి కథ రాయడానికి ట్రూ ఇన్స్పిరేషన్ మై గ్రాండ్ మదర్ అండ్ మై వైఫ్. వాళ్లే నాకు ఇన్స్పిరేషన్. రచ్చ సినిమా నుంచి తమన్నా గారితో  జర్నీ ఉంది. తను అద్భుతమైనటువంటి పెర్ఫార్మర్. ఈ సినిమాలో శివశక్తి పాత్రని మరో స్థాయిలో చేశారు. సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. మండుటెండలో చెప్పులు లేకుండా నడిచారు. ఈ సినిమా తర్వాత తమన్నా గారి డిఫరెంట్ రోల్స్ వస్తాయి. ఆమె కోసం పాత్రలు క్రియేట్ అవుతాయి.  ప్రేక్షకులకి ఈ సినిమా గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. ఏప్రిల్ 17న థియేటర్స్ లో సినిమా చూడండి. ఖచ్చితంగా బ్లాస్టింగ్ ఎక్స్ పీరియన్స్ ఉంటుంది’అన్నారు.

యాక్టర్ వశిష్ట సింహ మాట్లాడుతూ.. తమన్నా గారికి నేను అభిమానిని. తమన్నా గారితో కలిసి నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమాలో ఆ అవకాశం వచ్చింది. ఇది ఈ సినిమా క్రెడిట్ అంతా సంపత్ నందిగారికి దక్కుతుంది. చాలా పవర్ ఫుల్ మూవీ ఇది. మధుగారు ఈ సినిమాని చాలా బిగ్ స్కేల్లో తీశారు. తమన్నా గారు 20 ఏళ్లుగా అద్భుతం అద్భుతమైన జర్నీ చేస్తున్నారు. ఆమె చాలామందికి ఇన్స్పిరేషన్. ఈ సినిమాలో మరోసారి తమన్నా గారి మ్యాజిక్ చూడబోతున్నారు. కేజిఎఫ్ తో నేను మీకు పరిచయం. అది మాస్ ఎక్స్ పీరియన్స్. ఈ సినిమా ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ లా ఉండబోతుంది. మీ అందరి సపోర్టు కావాలి’అన్నారు.

నిర్మాత డి మధు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఏప్రిల్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తమన్నా గారు ఈ సినిమాలో చాలా అద్భుతంగా పెర్ఫామ్  చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకి వండర్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది’ అన్నారు

ఆదిత్య భాటియా మాట్లాడుతూ.. నాకు కమర్షియల్ సినిమాల మీద చాలా నమ్మకం. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే చాలా నచ్చింది. చాలా పెద్ద కమర్షియల్ సినిమా అవుతుందనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా కంప్లీట్ ప్యాకేజ్ లా ఉంటుంది. తమన్నా గారు ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. థియేటర్స్ లో ఈ సినిమా అదరగొట్టబోతుంది. ‘అన్నారు.