Movie News

ఐశ్వర్య – అభిషేక్ బచ్చన్‌ విడాకులు నిజమేనా..?

చిత్రసీమలో విడాకులు అనేవి చాల కామన్. షూటింగ్ సమయంలో దగ్గరవ్వడం ..కొంతకాలం సహజీవనం చేయడం..తర్వాత పెళ్లి చేసుకోవడం..ఆ తర్వాత కొంతకాలానికే విడాకులు తీసుకోవడం చేస్తుంటారు. ఇప్పటి వరకు ఎంతోమంది సినీ జంటలు విడాకులు తీసుకున్నారు. తాజాగా ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్‌ లు సైతం విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్ లో ఎప్పటి నుండో చక్కర్లు కొడుతూ వస్తున్నాయి. అయితే దీనిపై ఇరువురు స్పందించకపోవడం తో విడాకులు నిజామా..కదా అనేది అర్ధం కావడం లేదు. ఈ క్రమంలో అభిషేక్ లీక్ తో విడాకులు నిజమే అని అంత మాట్లాడుకుంటున్నారు.

ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్‌ల పెళ్లికి సినీ ప్రముఖులు తమ కుటుంబాలతో సహా తరలివచ్చారు. ఈ పెళ్లికి ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్‌తో కాకుండా కుమార్తె ఆరాధ్యతో అటెండ్ కావడంతో విడాకుల వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అభిషేక్ బచ్చన్ హీనా ఖండేల్వాల్ ఇన్‌స్టాలో పెట్టిన విడాకుల పోస్ట్‌కు లైక్ కొట్టడంతో పుకార్లకు బలం చేకూరినట్లయ్యింది. ఆల్రెడీ అభిషేక్ – ఐశ్వర్యలకు విడాకులు మంజూరై సెపరేట్ అయినట్లుగా కథనాలు వస్తున్నాయి. తాము కలిసే ఉన్నామని చెప్పేలా ఐష్ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసినప్పటికీ ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఇంతకీ అభిషేక్ లైక్ కొట్టిన ఆ పోస్ట్‌లో ఏముందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రేమ కష్టంగా మారినప్పుడు, విడాకులు తీసుకోవడం సులభం కాదు అని.. కొన్ని సార్లు మనం కోరుకున్నట్లుగా జీవితం సాగదని.. దశాబ్ధాల పాటు కలిసి ఉండి, సెపరేట్ అయిన తర్వాత ఎలా ఉంటారు. బంధాన్ని ఎందుకు తెంచుకోవాలనుకుంటున్నారు.. 50 ఏళ్ల వయసు దాటినవారు కూడా ప్రపంచవ్యాప్తంగా విడిపోతున్నారని, ఇందుకు కారణాలు చిత్ర విచిత్రంగా ఉంటాయని హీనా పోస్ట్ పెట్టారు. దీనికే అభిషేక్ ఇప్పుడు లైక్ కొట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్‌లు 2007లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు 2011లో ఆరాధ్య పుట్టింది. అయితే ఇటీవలి కాలంలో ఈ జోడీ మధ్య రిలేషన్ దెబ్బతిన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి బాలీవుడ్‌లోని పెద్ద కుటుంబంలో నిజంగానే గొడవలు జరుగుతున్నాయా లేక అవి కేవలం పుకార్లేనా అన్నది తెలియాల్సి ఉంది. అప్పటి వరకు ఈ ఊహాగానాలకు తెరపడవు.