Tuesday, December 24, 2024
HomeMovie Newsఆ ఒక్కటీ అడక్కు ఎలా ఉందంటే..

ఆ ఒక్కటీ అడక్కు ఎలా ఉందంటే..

- Advertisement -

‘అల్లరి’ మూవీ తో తన పేరునే అల్లరి నరేష్ గా మార్చుకున్న నరేష్..తాజాగా ఆ ఒక్కటీ అడక్కు అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత కొన్ని ఏళ్లుగా హీరోగా నరేష్ కు ఒక్క సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే. సుడిగాడు తర్వాత ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేస్తూ ఉన్నప్పటికీ ఒక్క సక్సెస్ కూడా కొట్టలేకపోయాడు. చాల రోజుల తర్వాత మళ్లీ హీరో గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈరోజు ఆ ఒక్కటీ అడక్కు అంటూ వచ్చాడు. మల్లి అంకం తెరకెక్కించిన ఈ మూవీని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. గోపీ సుందర్ దీనికి సంగీతం అందించారు. ఇందులో వెన్నెల కిశోర్, ఆరియానా గ్లోరీ, హర్ష, జమ్మీ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపించారు.

పెళ్లీడు వచ్చినా వివాహం చేసుకోని ఓ కుర్రాడికి ఎలాంటి సమస్యలు వచ్చాయి? సమాజంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? చివరికి ఇష్టపడిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు? అనే అంశాలతో తెరకెక్కిన చిత్రమే ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఫుల్ లెంగ్త్ కామెడీ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రం..ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. హీరోకి అంత వయసొచ్చినా, అంతా సెటిల్ అయినా కూడా పెళ్లి ఎందుకు కాలేదు అనే పాయింట్‌ను అంత కన్విన్సింగ్‌గా చెప్పలేకపోయారు. ప్రభుత్వ ఉద్యోగం, ఫ్లాట్, ఆస్తి ఉన్నాయంటే పెళ్లి ఈజీగానే జరుగుతుంది కదా? అని అంతా అనుకుంటారు. ఇందులో హీరోకు ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందని, పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయిందని అర్థం అవుతుంది. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. పార్టులు పార్టులుగా, బ్లాకులు బ్లాకులుగా అక్కడక్కడా బాగానే నవ్విస్తారు. కానీ రెండు గంటలకు పైగా ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేయలేకపోయాడు. ఓవరాల్ గా చూస్తే సినిమా వన్ టైం చూడొచ్చు అంతే.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read