గత కొద్దీ నెలలుగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ లేకపోయేసరికి థియేటర్స్ అన్ని బోసిపోయాయి. కనీసం 50 మంది కూడా రావడం లేదు. దితో చాల థియేటర్స్ మూతపడుతున్నాయి. ఈ తరుణంలో మే 3 న బాక్స్ ఆఫీస్ వద్దకు నాల్గు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ‘ప్రసన్నవదనం’, ‘ఆ ఒక్కటీ అడక్కు’ , ‘బాక్’, ‘శబరి’ సినిమాలు వచ్చాయి. వీటిల్లో భారీ అంచనాల నడుమ ‘ప్రసన్నవదనం’ తర్వాత ‘ఆ ఒక్కటీ అడక్కు’ విడుదలయ్యాయి. కానీ రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ రాబట్టుకున్న సినిమాలు ‘ప్రసన్నవదనం’ ‘శబరి’. పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో ఈ రెండు చిత్రాల కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని అనుకున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం అల్లరోడికి జై కొట్టారు.
‘అల్లరి’ మూవీ తో తన పేరునే అల్లరి నరేష్ గా మార్చుకున్న నరేష్..తాజాగా ఆ ఒక్కటీ అడక్కు అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత కొన్ని ఏళ్లుగా హీరోగా నరేష్ కు ఒక్క సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే. సుడిగాడు తర్వాత ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేస్తూ ఉన్నప్పటికీ ఒక్క సక్సెస్ కూడా కొట్టలేకపోయాడు. చాల రోజుల తర్వాత మళ్లీ హీరో గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈరోజు ఆ ఒక్కటీ అడక్కు అంటూ వచ్చాడు. మల్లి అంకం తెరకెక్కించిన ఈ మూవీని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. గోపీ సుందర్ దీనికి సంగీతం అందించారు. ఇందులో వెన్నెల కిశోర్, ఆరియానా గ్లోరీ, హర్ష, జమ్మీ సహా పలువురు కీలక పాత్రల్లో కనిపించారు.
ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు. తొలి రోజు ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా కోటిన్నర వరకు గ్రాస్ ను కలెక్ట్ చేయగా..దీనికంటే ‘ప్రసన్నవదనం’ ఓపెనింగ్స్ తక్కువగా నమోదు అయ్యాయి. ఇక రెండో రోజు బుకింగ్స్ ను గమనిస్తే.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ‘బాక్'(డబ్బింగ్ సినిమా) కి మంచి నంబర్స్ రిజిస్టర్ అయ్యాయి. తర్వాతి ప్లేస్ లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఉంది. ‘ప్రసన్నవదనం’ 3 వ ప్లేస్ లో ఉంది. దీనిని బట్టి చూస్తుంటే.. ప్రేక్షకులు థ్రిల్లర్స్ కంటే కామెడీ సినిమాలకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ఆ ఒక్కటి అడక్కు మూవీ తో అర్థమైంది.