Home Movie News పవన్ కోసం కదిలిన చిత్రసీమ…

పవన్ కోసం కదిలిన చిత్రసీమ…

0
పవన్ కోసం కదిలిన చిత్రసీమ…

ఏపీలో మరో నాల్గు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగబోతున్నాయి. ఈ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీనికి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడమే. చిత్రసీమలో అగ్ర హీరోగా ఉన్న ఆయన..తన సినిమాలను వదిలేసి ప్రజలకు సేవ చేయాలనీ పదేళ్లుగా కష్టపడుతుండడంతో ఈసారి ఆయన విజయం సాధించాలని యావత్ సినీ ప్రముఖులు , అభిమానులు , ప్రజలు కోరుతున్నారు. ఇందులో భాగంగా తమవంతు ప్రచారం మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు పెద్దగా ఎవరు సపోర్ట్ చేయనప్పటికీ..ఇప్పుడు మాత్రం చిన్న , పెద్ద హీరోలు , నటి నటులు , నిర్మాతలు ఇలా అంత తమ మద్దతును తెలియజేస్తూ జగన్ కు షాక్ ఇస్తున్నారు.

నిన్న చిరంజీవి , రామ్ చరణ్ , హీరో నాని తదితరులు తమ మద్దతును సోషల్ మీడియా వేదికగా పంచుకోగా..నిర్మాత నాగ వంశీ , షకలక శంకర్ , సప్తగిరి వంటి వారు ప్రచారం మొదలుపెట్టారు. వీరే కాక గత 20 రోజులుగా జబర్దస్త్ సభ్యులు కూడా ప్రచారం చేస్తూ గాజు గ్లాస్ కు ఓటు వెయ్యండని కోరుకుంటూ వస్తున్నారు. మొదటి నుండి చిత్రసీమ జగన్ విషయం లో చాల సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో జగన్ చేసిన తీరు సగటు ప్రజలకు కూడా నచ్చలేదు. సినిమాలను , రాజకీయాలను వేరు వేరుగా చూడాలి తప్ప రెండిటిని ఒకటి చేయొద్దని సూచించారు కూడా..అయినప్పటికీ జగన్ తన తీరు మార్చుకోలేదు. అందుకే టైం చూసుకొని చిత్రసీమ పగ తీర్చుకోవడం మొదలుపెట్టింది.