2023 ఏడాదికిగానూ 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో సౌత్ నుంచి (తెలుగు) ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకోగా, బెస్ట్ డైరెక్టర్‌గా ఎస్.ఎస్.రాజమౌళి పురస్కారాన్ని దక్కించుకున్నారు. అయితే ఉత్తమ నటుడిగా మాత్రం ఇద్దరు ఎంపికయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని తమ నటనకుగానూ జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను సంయుక్తంగా ఈ అవార్డు వరించింది.
ఇక మిగతా విజేతల విషయానికి వస్తే..
ఉత్తమ చిత్రం : RRR
ఉత్తమ దర్శకుడు : S. S. రాజమౌళి (RRR)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) : సీతా రామం (హను రాఘవపూడి)
ఉత్తమ నటుడు (Male) : రామ్ చరణ్ (RRR), జూనియర్ ఎన్టీఆర్ (RRR)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : దుల్కర్ సల్మాన్ (సీతా రామం)
ఉత్తమ నటి (Female) : మృణాల్ ఠాకూర్ (సీతా రామం)
ఉత్తమ నటి (క్రిటిక్స్) : సాయి పల్లవి (విరాట పర్వం)
ఉత్తమ సహాయ నటుడు (Male) : రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
ఉత్తమ సహాయ నటి (Female) : నందితా దాస్ (విరాట పర్వం)
ఉత్తమ సంగీత దర్శకుడు : M. M. కీరవాణి (RRR)
ఉత్తమ పాటల రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి – కానున్న కళ్యాణం (సీతా రామం)
ఉత్తమ నేపథ్య గాయకుడు : (Male) కాల భైరవ – కొమురం భీముడో (RRR)
ఉత్తమ నేపథ్య గాయని (Female) : చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమ- సీతారామం)
ఉత్తమ కొరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు- RRR)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : సాబు సిరిల్ (RRR)
ఇక ఇందులో RRR చిత్రానికి అత్యధికంగా 7 విభాగాల్లో అవార్డులు లభించగా, సీతారామం చిత్రానికి 4 విభాగాల్లో అవార్డులు లభించాయి.