Movie News

హే భగవాన్! ఖచ్చితంగా హిట్ అవుతుంది-సుహాస్

సుహాస్ యూనిక్ స్క్రిప్ట్‌లతో అలరిస్తున్నాడు. ప్రస్తుతం నూతన దర్శకుడు గోపి అచ్చర దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఈ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ను త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు, ఇది వారి ప్రొడక్షన్ నంబర్ 2. రైటర్ పద్మభూషణ్‌ ఫేం షణ్ముక ప్రశాంత్ ఈ కథను రాశారు.

సుహాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను లాంచ్ చేసి ఫన్ ని డబుల్ చేశారు. ఈ చిత్రానికి హే భగవాన్! అనే టైటిల్‌ పెట్టారు. ఈ టీజర్ సస్పెన్స్, కామెడీ తో అదిరిపోయింది.

ఒక టీమ్ వీడియో బయటికి వస్తే ఫ్యామిలీ సీక్రెట్ బిజినెస్ బయటపడిపోతుందని నరేష్ పిఎ హెచ్చరించే సన్నివేశంతో టైటిల్ టీజర్ ప్రారంభమవుతుంది. సుహాస్ స్టైలిష్ ఎంట్రీ ఆకట్టుకుంది. సుహాస్, శివానీ నగరం మధ్య  సీక్రెట్ ఫ్యామిలీ బిజినెస్ పై జరిగే ఓ ఆర్గ్యుమెంట్ హిలేరియస్ గా వుంది.

డైరెక్టర్ గోపీ అచ్చర టీజర్‌ని స్మార్ట్‌గా కట్ చేశారు. మిస్టరీ బయటపెట్టకుండా, సిట్యుయేషన్స్‌, క్యారెక్టర్స్‌తోనే లాఫ్స్ జనరేట్ చేశారు.

సుహాస్ స్లీక్ లుక్‌లో కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌గా శివాని నాగరం గ్లామరస్‌గా కనిపించింది. సుహాస్ ఫాదర్‌గా నటించిన సీనియర్ నరేశ్ తన నేచురల్ కామెడీతో ఆకట్టుకున్నాడు. సుదర్శన్ కూడా తన కామెడీతో ఎంటర్టైన్మెంట్ డబుల్ చేశాడు.

మాహి రెడ్డి పండుగుల సినిమాటోగ్రఫీ సినిమాకి కలర్, ఎనర్జీ ఇచ్చింది. వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో ఎంటర్టైన్మెంట్‌ను  రెట్టింపు చేశాడు. ఎడిటింగ్ విప్లవ్ నైషదం, ఆర్ట్ డైరెక్షన్ ఏ.రామ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రమణా రెడ్డి. మొత్తానికి ఎంగేజింగ్ టీజర్‌ ‘హే భగవాన్!’ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ అవుతుందనే హైప్ క్రియేట్ చేసింది.

టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుహాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. హే భగవాన్ షూటింగు మంచి ఫ్లోలో స్టార్ట్ అయింది. ఈ సినిమాలో సుదర్శన్ నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. మా ఇద్దరి కాంబినేషన్ చాలా అద్భుతంగా వచ్చింది. తనకి ఈ సినిమాతో చాలా మంచి పేరు వస్తుందని నమ్మకం ఉంది. శివానితో వర్క్ చేయడం రెండోసారి. సినిమాలో మరింత మంచి పేరు వస్తుంది. ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి థాంక్యూ .కథ చెప్పిన వెంటనే  పట్టాలెక్కించారు. ఆయన ప్రొడక్షన్లో మరో సినిమా చేస్తున్నాను. త్వరలోనే అది అనౌన్స్ అవుతుంది. ఈ సినిమాకి సపోర్ట్ గా నిలిచిన వంశీ గారికి థాంక్యూ .ఆయన చెప్పినట్టు కచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ప్రశాంత్ ఈ సినిమాకి అద్భుతమైన కథ ఇచ్చాడు. డైరెక్టర్ గోపి అన్న కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్ కి కూడా పనిచేశారు. ఈ సినిమాతో తను డైరెక్టర్ గా డెబ్యు అవుతున్నారు. కచ్చితంగా మంచి హిట్ కొడతాం. నా ఫేవరెట్ నరేష్ గారితో పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాని యాక్సెప్ట్ చేసినందుకు నరేష్ గారికి థాంక్యూ సో మచ్. టీమ్ అందరికీ థాంక్యు సో మచ్. సినిమా అదిరిపోతుంది.

హీరోయిన్ శివాని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.  సుహాస్ గారితో నాకు ఇది సెకండ్ ఫిల్మ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్యూ సో మచ్. సుహాస్ చాలా న్యూ లుక్ లో కనిపిస్తున్నారు. నరేష్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది.  

డాక్టర్ నరేష్ వి కె మాట్లాడుతూ..  సభకు నమస్కారం. నేను చాలా బిజీగా ఉన్నప్పుడు సామజవరగమన సినిమా వచ్చింది. డేట్స్ అడ్జస్ట్ కావేమో అనుకున్నాను. కానీ రెండు నెలల ఆగి ఆ సినిమా చేయడం జరిగింది. అ సినిమా నాకు నా కెరీర్లో మర్చిపోలేని సినిమా అయింది. హే భగవాన్ కూడా అలాంటి సినిమా అవుతుంది. నాకోసం డేట్స్ ని అడ్జస్ట్ చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలకు థాంక్యూ సో మచ్. ఈ సినిమా చేయకపోతే నిజంగా ఒక అద్భుతమైన సినిమా, క్యారెక్టర్ ని మిస్ అయ్యేవాడిని.  హే భగవాన్ ఈ టైటిల్ ఎందుకు పెట్టామో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.  కథ విన్నప్పుడు పగలబడి నవ్వాను. చాలా కొత్త బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు. ఈ గ్లిమ్స్ చూడగానే నాకు మరింత ఎక్సైట్మెంట్ వచ్చింది. సుహాస్ తెలుగు సినిమా ప్రైడ్.  తను 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో పూర్తి చేసుకుంటాడని నమ్మకంగా చెబుతున్నాను. డైరెక్టర్ గోపికి చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. నిర్మాత నరేందర్ రెడ్డి గారికి అద్భుతమైన విజయాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాల్లో పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. హే భగవాన్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.

డైరెక్టర్ గోపి అచ్చర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మా నిర్మాత చాలా క్లారిటీతో ఉంటారు. ఈ కథ మార్చిలో చెప్తే ఏప్రిల్ కి ఆఫీసు ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయించారు. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. సుహాస్ తో నా జర్నీ ఐదేళ్లుగా ఉంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. డెబ్యు ఫిలిం మేకర్ కి ఫస్ట్ హీరో చాలా స్పెషల్. ఇంత స్పెషల్ మూమెంట్ ని ఇచ్చిన సుహాస్ కి థాంక్యూ. ఈ సినిమాకి ఫాదర్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు నాకు నరేష్ గారే ఫస్ట్ గుర్తుకొచ్చారు. ఆయన కథ విని ఓకే చేయడం మాకు గొప్ప నమ్మకాన్ని ఇచ్చింది. ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో మంచి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా ఉంటుంది.

వంశీ నందిపాటి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా నిర్మాతలకు అభినందనలు. వారి ప్రొడక్షన్ హౌస్ మరింత గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. సుహాస్ జర్నీ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. తను ఇప్పుడు వరకు చాలా అద్భుతమైన సినిమాలు చేశారు. ఇకపై కూడా సుహాస్ 2.0 చూస్తారు. దానికి పునాది హే  భగవాన్ అవుతుంది. నరేష్ గారు అప్పటికి ఇప్పటికీ ఒకే ఎనర్జీతో ఉన్నారు. ఈ సినిమాల్లో కూడా అద్భుతంగా పెర్ఫాం చేశారు. చాలా మంచి టీం తో వస్తున్న సినిమా ఇది. తప్పకుండా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.