Movie News

సుందర్ సి #Thalaivar 173 అనౌన్స్‌మెంట్

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకం బ్యానర్ పై భారత సినీ రంగంలో మైలు రాయిగా నిలిచే మహత్తరమైన ప్రాజెక్ట్‌ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది ఇద్దరు మహానటుల మధ్య ఐదు దశాబ్దాల స్నేహం, సహోదర బంధాన్ని సెలబ్రేట్ చేసుకునే బిగ్ సినిమాటిక్ ఈవెంట్. రజనీకాంత్–కమల్ హాసన్‌ల అనుబంధం తరతరాల కళాకారులకు, ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తుంది.

రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ 44 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకొని రూపొందుతున్న #Thalaivar173  సూపర్‌స్టార్ రజనీకాంత్ మాగ్నటిక్ స్క్రీన్ పవర్, సుందర్ సి డైరెక్షన్‌ కలిపి ప్రేక్షకులకు విశేషమైన అనుభూతిని అందించబోతుంది.

కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా పొంగల్ 2027 సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.