Movie News

సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ సీపీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

 చిరంజీవి, సజ్జనార్‌ మధ్య మంచి అనుబంధం వుంది. గతంలో సైబరాబాద్‌ సీపీగా పనిచేసిన సమయంలో,  కరోనా సమయంలో ప్లాస్మా దానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇద్దరూ కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 మెగాస్టార్ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్’ చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.