Movie News

రానా దగ్గుబాటి ‘కాంత’ ఇంటెన్స్ ట్రైలర్‌

దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా ‘కాంత’ నవంబర్ 14న విడుదల కానుంది. టీజర్, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి.   ట్రైలర్ రిలీజ్ తో ఇప్పుడు ఎక్సయిట్మెంట్ మరింత పెరిగింది. రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన ట్రైలర్ ఇంటెన్స్ ఎమోషనల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తో అదిరిపోయింది.    

ఒక రైజింగ్ స్టార్, అతనికి దారి చూపిన గురువు మధ్య ఉన్న ఎమిషన్ ని ట్రైలర్ ఆసక్తికరంగా ప్రజెంట్ చేసింది. ఈ ఇద్దరి డ్రీం ప్రాజెక్ట్ ‘శాంత’ దగ్గరకి వచ్చేసరికి ఇగో వార్ గా మారుతుంది. స్నేహం, ఆశయాల మధ్య నడిచే ఈ సంఘర్షణ ‘కాంత’ కథపై మరింత ఆసక్తిని పెంచింది.

దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్‌ ఈ కథను ఎమోషన్స్ హార్ట్ టచ్చింగ్ డ్రామాటిక్‌ సన్నివేశాలతో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ క్రియేటివ్ విజన్ కనిపించింది.  

దుల్కర్‌ సల్మాన్‌ తన అద్భుతమైన నటనతో  వెర్సటిలిటీని నిరూపించాడు. గుర్తింపు కోసం ఆత్రుతగా ఉన్న కొత్త నటుడి నుంచి, స్టార్ డమ్ కు చేరిన తర్వాత ఈగోని ప్రదర్శించే స్టార్‌గా అతని ట్రాన్స్ఫర్మేషన్ అదిరిపోయింది. సముద్రఖని సహజమైన నటనతో గురువు పాత్రలో ఆకట్టుకున్నారు. భాగ్యశ్రీ బోర్స్‌ కథకు ప్రాణం పోసే పాత్రలో కనిపించారు. రానా దగ్గుబాటి పోలీస్‌ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇవ్వడం కథలో కొత్త టెన్షన్‌, బలాన్ని తెచ్చింది.

డానీ సాంచెజ్‌ లోపెజ్‌ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో హైలెట్. మోనోక్రోమ్‌ టోన్‌లో చూపించిన పీరియడ్‌ సెట్టింగ్‌ అద్భుతంగా కనిపిస్తుంది. ఆర్ట్‌ డైరెక్టర్‌ రామలింగం రూపొందించిన సెట్లు క్లాసిక్‌ సినిమాల యుగానికి మళ్లీ సజీవం పోశాయి. జాను చాంతర్‌ సంగీతం ప్రతి సీన్ ని ఎలివేట్ చేసింది

దుల్కర్‌ సల్మాన్‌ ‘వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్‌ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా వున్నాయి. ఇంటెన్స్ ఎమోషన్స్ తో ఆకట్టుకున్న ‘కాంత’ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది.