సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్ మేకర్ వెంకటేష్ మహా కొత్త చిత్రం రావు బహదూర్‌ను గర్వంగా ప్రజెంట్ చేస్తోంది. ఇందులో వెర్సటైల్ హీరో సత్య దేవ్ ప్రధాన పాత్రలో నటించారు. కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన వెంకటేష్ మహా ఇప్పుడు తెలుగు సినిమా బౌండరీలు దాటే ఒక ఎక్సయిటింగ్ సైకాలజిక్ డ్రామాలోకి అడుగుపెడుతున్నారు. పరిశ్రమలోని అత్యంత విజయవంతమైన రెండు బ్యానర్‌లు ఎ+ఎస్ మూవీస్ , శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న రావు బహదూర్ ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తోంది. టైటిల్ ఫస్ట్-లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈరోజు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ‘నాట్ ఈవెన్ ఎ టీజర్’ లాంచ్ చేశారు.
జమీందారీ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఓ పాత కోటలో ఒంటరిగా జీవిస్తున్న హీరోని పరిచయం చేస్తారు. తనకి అనుమానం అనే భూతం పట్టుకుందని నమ్ముతాడు. ఆ అనుమాన భూతమే తన జీవితాన్ని మార్చేస్తుంది. నిజం, భ్రమ మధ్య గీతే కనిపించకుండా చేస్తుంది. అతని గతంలో ఒక రహస్యమైన ప్రేమకథ కూడా ఉంటుంది. ఆ ప్రేమకథలోనూ లోతైన భావోద్వేగాలు, సైకాలజికల్ లేయర్స్ దాగి ఉంటాయి.
మరో వైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లైన్ కూడా నడుస్తుంది. కానీ వాళ్ల ప్రశ్నలతో క్లారిటీ రాకుండా, మిస్టరీ మరింత పెరుగుతుంది. ఇవన్నీ కేవలం స్టార్ట్ మాత్రమే, ఇక్కడి నుంచి ఇంకా టెర్రిఫిక్ ట్విస్ట్ మొదలౌతుంది.
విజువల్ స్టైల్లో ఈ సినిమా పోయిట్రీలా కనిపిస్తుంది. తన ప్రత్యేకమైన నేరేషన్‌తో వెంకటేశ్ మహా మరోసారి తన స్టోరీటెల్లింగ్‌కి స్పెషల్ మార్క్ వేశారు. డ్రామా, సైకాలజికల్ థ్రిల్, డార్క్ హ్యూమర్ థ్రిల్ చేశాయి.
హీరో సత్యదేవ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు వేర్వేరు లుక్స్‌లో, వేర్వేరు భావాలతో పాత్రను అద్భుతంగా పోషించాడు. అతని నటనలోని డెప్త్, న్యూయాన్స్ కట్టిపడేశాయి. అతనితో పాటు వికాస్ ముప్పాల, దీపా థామస్, ఆనంద్ భారతి లాంటి ప్రధాన పాత్రలను కూడా పరిచయం చేశారు.
సినిమాటోగ్రాఫర్ కార్తిక్ పర్మార్ విజువల్స్ ట్రీట్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ స్మరన్ సాయి బ్యాక్‌డ్రాప్‌ని ఎలివేట్ చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ రోహన్ సింగ్ సెట్‌లతో రియలిస్టిక్ ఫీల్ ఇచ్చాడు. మొత్తంగా గ్రాండ్ సినిమాటిక్ విజన్ కనపడుతుంది.
“నాట్ ఈవెన్ ఎ టీజర్”తో క్యురియాసిటీ రెట్టింపైంది. రావు బహదూర్ తెలుగుతో పాటు ఇతర భాషల సబ్టైటిల్స్‌తో 2026 సమ్మర్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.