Movie News

రాఘవ లారెన్స్ ‘బుల్లెట్టు బండి’ థ్రిల్లింగ్ టీజర్

డైరీ సినిమాతో సక్సెస్ సాధించిన నిర్మాత ఫైవ్ స్టార్ క్రియేషన్స్‌ కతిరేసన్ మళ్లీ దర్శకుడు ఇన్నాసి పాండియన్ తో జట్టుకట్టారు. రాఘవ లారెన్స్ హీరోగా  సూపర్-నేచురల్ యాక్షన్ థ్రిల్లర్‌ ‘బుల్లెట్టు బండి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నారు.  

రాఘవ లారెన్స్ తో పాటు ఆయన తమ్ముడు ఎల్వీన్ కూడా లీడ్ రోల్ చేస్తున్నారు. ఫాస్ట్ పేస్‌తో సాగే ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది.

యువసామ్రాట్ నాగచైతన్య ఈరోజు బుల్లెట్టు బండి టీజర్‌ను లాంచ్ చేశారు. టీజర్‌ అంచనాలను పెంచేలా క్రియేట్ చేసినందుకు టీమ్‌ను ప్రశంసించారు.

80, 90ల్లో అభిమానుల డ్రీమ్ గర్ల్‌గా వెలుగొందిన డిస్కో శాంతి శ్రీహరి ఈ సినిమా ద్వారా 28 ఏళ్ల తర్వాత సినీ రంగంలోకి తిరిగి అడుగుపెడుతున్నారు. 1997 తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు. ఈ సినిమాలో ఆమె ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు.

చెన్నై, తేంకాసి, కేరళతో పాటు పలు అద్భుతమైన లొకేషన్లలో షూట్ జరిగింది. వైశాలి రాజ్, సునీల్, అరవింద్ ఆకాష్, కాలీ వెంకట్, రంగరాజ్ పాండే, ఆర్. సుందరరాజన్, చామ్స్, శివ శరా, కేపీవై వినోత్, విజే థనికై, సెండ్రాయన్ వంటి పలువురు నటులు ముఖ్య పాత్రల్లో నటించారు.

దర్శకుడు ఇన్నాసి పాండియన్ మాట్లాడుతూ.. “ఇది ఫుల్ లెంగ్త్ సూపర్-నేచురల్ యాక్షన్ థ్రిల్లర్‌. ఈ జానర్‌ను ఆడియన్స్‌కు టీజర్ అద్భుతంగా కన్వే చేస్తోంది. మొదట ఈ కథను నా డెబ్యూ ఫిల్మ్‌గా డైరెక్ట్ చేయాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదు. కాబట్టి ఇప్పుడు రెండో సినిమాగా చేశాను. నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన నిర్మాతలకి థ్యాంక్స్.” అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం సామ్ సి.ఎస్., సినిమాటోగ్రఫీని డీమోంట్ కాలనీ, డైరీ సినిమాల ఫేం డిఓపీ అరవింద్ సింగ్ చేశారు. ఎడిటింగ్‌ వడివేల్ విమల్రాజ్, స్టంట్స్‌ ఫ్యాంటమ్ ప్రదీప్.

‘బుల్లెట్ బండి’ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.