Movie News

మోహన్‌లాల్‌ గారికి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం తగిన గుర్తింపు

మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌ను కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసింది. మలయాళంలోనే కాకుండా ప్రధాన భారతీయ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించిన మోహన్‌లాల్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌లాల్‌ను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిజేశారు

“డియర్ లాలెట్టన్, ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడినందుకు హృదయపూర్వక అభినందనలు. మీ అద్భుతమైన ప్రయాణం, ఐకానిక్ పెర్ఫార్మెన్స్, భారతీయ సినిమాను సుసంపన్నం చేశాయి. నిజంగా ఇది మీకు తగిన గుర్తింపు’

ఈ సందర్భంగా మోహన్‌లాల్‌తో ఉన్న ఫోటోని షేర్ చేశారు మెగాస్టార్. మోహన్‌లాల్‌తో మెగాస్టార్ చిరంజీవికి మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ నెల 23న జరిగే 71వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో  భారత ప్రభుత్వం మోహన్‌లాల్‌ను ఈ అవార్డుతో సత్కరించనున్నారు.