భాగ్య శ్రీ బోర్సే టాలీవుడ్లో తన కేరీర్ని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తోంది. తొలిచిత్రం మిస్టర్ బచ్చన్‌తో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా, తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా, ఆమెకు మరో క్రేజీ ఛాన్స్ దక్కించుకుంది. రామ్ పోతినేని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న కొత్త చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది. ఈ చిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేశ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ RAPO22 పేరుతో ప్రచారంలో ఉంది. నవంబర్ 21న పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించనున్నారు. భాగ్య శ్రీ ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ మరియు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం కాంతలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.
మహారాష్ట్రకు చెందిన భాగ్య శ్రీ మోడలింగ్ ద్వారా తన ప్రయాణం ప్రారంభించి, పలు వాణిజ్య ప్రకటనలతో గుర్తింపు పొందింది. అనంతరం, తన తొలి చిత్రం మిస్టర్ బచ్చన్‌లో జిక్కీ పాత్ర ద్వారా ప్రేక్షకులను మెప్పించింది. అలాగే, హిందీ చిత్రం యారియాన్ 2 మరియు చుందు ఛాంపియన్ వంటి సినిమాల్లో కనిపించింది.